యూఏఈలోని ఇండియన్ స్కూల్స్ రమదాన్ ప్రణాళికలు..!!
- January 07, 2026
యూఏఈ: ఫిబ్రవరి నెల మధ్యలో రమదాన్ ప్రారంభం కానున్నందున, యూఏఈలో ఉన్న ఇండియన్ స్కూల్స్ ఫైనల్ పరీక్షలకు సంబంధించి వివిధ షెడ్యూల్స్ ను రూపొందిస్తున్నాయి. పాఠశాల సమయాల్లో మార్పుల నుండి టీచింగ్ స్టాఫ్ వర్కింగ్ అవర్స్ లోనూ మార్పులు చేస్తున్నారు.
ముఖ్యంగా బోర్డు లేదా ప్రమోషన్ పరీక్షలకు సిద్ధమవుతున్న పిల్లలు రమదాన్ ఉపవాసం సమాయాలు ఇతర షెడ్యూల్ గురించి ఏడాది ముందుగానే స్కూల్స్ ప్లాన్ చేసుకున్నట్లు పలువురు పేరెంట్స్ తెలిపారు.
స్ప్రింగ్డేల్స్ స్కూల్ దుబాయ్‌లో రమదాన్ సమయాలను ప్రతిబింబించేలా పరీక్ష క్యాలెండర్ కంటే స్కూల్ వేళలను సర్దుబాటు చేయడంపై దృష్టి సారించినట్లు తెలిపింది. పరీక్షా షెడ్యూల్లు పవిత్ర మాసం స్ఫూర్తిని గౌరవిస్తాయని ప్రిన్సిపాల్ డేవిడ్ జోన్స్ చెప్పారు. రమదాన్ కు అనుగుణంగా స్కూల్ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ముగిసేలా తాము ప్లాన్ చేసుకున్నామని, అలాగే, ఎగ్జామ్స్ సమయాల్లోనూ ఇదే టైమ్ షెడ్యూల్ ను ఫాలో అవుతామని తెలిపారు. పరీక్షలు ఫిబ్రవరి 16 మరియు మార్చి 11 మధ్య ఉంటాయని, ఈద్ మార్చి 19 లేదా 20 న వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు.
జెమ్స్ అవర్ ఓన్ ఇండియన్ స్కూల్ ప్రిన్సిపాల్ మరియు CEO లలిత సురేష్ మాట్లాడుతూ.. రమదాన్ దగ్గర పడటానికి ముందే పరీక్షల షెడ్యూల్లు ఖరారు చేయబడుతుందని అన్నారు. సడెన్ మార్పులకు తక్కవ ఆస్కారం ఉంటుందని పేర్కొన్నారు. విద్యా క్యాలెండర్ కు ఇబ్బంది లేకుండా షెడ్యూల్ ప్లానింగ్ ఉంటుందని తెలిపారు. సాధారణంగా ఒక సంవత్సరం ముందుగానే ఎగ్జామ్ తేదీలను KHDA ఖరారు చేస్తుందని, వాటిని ముందుగానే స్కూల్ డైరీలో ముద్రిస్తామని వెల్లడించారు.
అయితే, పరీక్షా తేదీలు మారకపోయినా, రమదాన్ సందర్భంగా ప్రత్యేకంగా సమయ పాలన ఉంటుందని అజ్మాన్‌లోని వుడ్లెం పార్క్ స్కూల్ ప్రిన్సిపాల్ భాను శర్మ తెలిపారు. ముందుగానే నిర్ణయించిన ఎగ్జామ్ డేట్స్ మారవని, కానీ రమదాన్ సమయంలో పనివేళలలో మార్పులు ఉంటాయని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఒమన్ డెసర్ట్ మారథాన్.. పోటీ పడుతున్న 1,200 మంది..!!
- ప్యాసింజర్ స్టేషన్లను ఆవిష్కరించిన ఇతిహాద్ రైల్..!!
- జాబర్ అల్-అహ్మద్ స్టేడియానికి పోటెత్తిన అభిమానులు..!!
- ఖతార్ లో వెహికల్స్, ప్రాపర్టీల ఆన్లైన్ వేలం..!!
- ‘ఫా9లా’ క్రేజ్.. త్వరలో ఇండియా టూర్‌కు ఫ్లిప్పరాచి..!!
- ఇజ్రాయెల్ అధికారి సోమాలిలాండ్ పర్యటన.. ఖండించిన సౌదీ..!!
- బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- అనుమతి లేకుండా ఫోటోలు వాడిన మసాజ్ సెంటర్ల పై కేసు పెట్టిన ఇన్ఫ్లూయెన్సర్
- ఇరాన్ దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు, ఇంటర్నెట్ నిలిపివేత
- తెలంగాణ: షోరూమ్‌లోనే వాహన రిజిస్ట్రేషన్







