ట్రంప్ మరో సంచలన నిర్ణయం.. భారీగా పెంచేసిన రక్షణ బడ్జెట్
- January 08, 2026
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఏడాది చాలా దూకుడుగా కనిపిస్తున్నారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారో.. లేదో వెనిజులా దేశాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరికొన్ని దేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోవైపు వాణిజ్య యుద్ధంతో ఇంకొన్ని దేశాలను దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఏడాది యుద్ధాలే అన్నట్టుగా అనూహ్యంగా అమెరికా సైనిక బడ్జెట్ను పెంచేశారు. 2027 నాటి సైనిక బడ్జెట్ను 1 ట్రిలియన్ నుంచి 1.5 ట్రిలియన్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. ఈ బడ్జెట్ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 36 శాతాన్ని సూచిస్తుంది. ప్రపంచ భద్రతా పరిస్థితి దుర్భలంగా ఉండటంతో ఇది అవసరం అని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ అమెరికా సైన్యాన్ని “డ్రీమ్ మిలిటరీ”గా తీర్చదిద్దడానికి సహాయపడుతుందని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు.
సెనేట్, కాంగ్రెస్, ప్రభుత్వ విభాగాలు, ఇతర రాజకీయ ప్రతినిధులతో విస్తృతమైన చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితి చాలా సున్నితమైందని.. ప్రమాదకరమైందని పేర్కొన్నారు. అందుకోసమే అమెరికా భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ఇప్పుడు చాలా అవసరంగా ట్రంప్ చెప్పుకొచ్చారు.
రక్షణ బడ్జెట్ పెంపుతో కలల సైన్యం నిర్మించబడుతుందని తెలిపారు. ఈ బడ్జెట్తోతో విదేశీ సవాళ్లను ఎదుర్కోవడానికి.. జాతీయ భద్రతను కాపాడటానికి అమెరికా సైన్యాన్ని శక్తివంతం చేస్తుందని స్పష్టం చేశారు. ఇంత బడ్జెట్ పెరగడానికి టారిఫ్ విధానమే కారణమని చెప్పారు. అమెరికా ప్రభుత్వం విధించిన టారిఫ్లు కారణంగా దేశానికి గణనీయమైన ఆదాయం వచ్చిందని తెలిపారు. ఈ ఆదాయంతో దేశభక్తిగల మధ్యతరగతి పౌరులకు ఆర్థిక ప్రయోజనాలను కూడా పెంచుతుందని చెప్పారు.
ఇప్పటికే పెంపు..
గత డిసెంబర్ ప్రారంభంలోనే అమెరికా సెనేట్ 2026 సంవత్సరానికి 901 బిలియన్ల రక్షణ బడ్జెట్ను ఆమోదించింది. ఇక 2027 సంవత్సరానికి ఆ బడ్జెట్ను మరింత పెంచేశారు. సైన్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ట్రంప్ ఈ అడుగులు వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇండిగో క్యాబ్ సర్వీసు వచ్చేసింది..
- మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం ప్రారంభించిన డీజీపీ ఆనంద్
- ఘనంగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవ వేడుకలు..
- కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం..15 మంది విద్యార్థులు అగ్నికి ఆహుతి..
- ఖతార్ రాస్ లాఫాన్ ఎల్ఎన్జీ ప్లాంట్ పేలుడు:13 మంది భారతీయులు, పాకిస్థానీయులు మృతి
- ఖతార్ పారిశ్రామిక ప్రమాదంపై భారత రాయబార కార్యాలయం స్పందన
- యూఏఈలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న తుంబే ల్యాబ్స్.. అంతర్జాతీయ ISO గుర్తింపు సాధన
- దుబాయ్ పోలీస్–భారత కాన్సులేట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
- కువైట్ లో గోల్డ్ ట్రేడ్ రూల్స్ కఠినతరం..!!
- మనమాలో 'ఇమామ్ హుస్సేన్ మెడికల్ క్లినిక్' ప్రారంభం..!!







