బంగ్లా-పాక్ లమధ్య పెరుగుతున్న రక్షణ బంధాలు
- January 08, 2026
ఆపరేషన్ సిందూర్ యుద్ధంలో ఘోరంగా ఓడిపోయిన పాకిస్థాన్ భారత్ పై తీవ్రకక్షను పెంచుకుంది. సింధునది జలాల విషయంలో భారత్ రాజీ లేకుండా తన నిర్ణయంపై కట్టుబడి ఉంది. దీంతో పాక్ ఏవిధంగానైనా భారత్ న దెబ్బకొట్టాలని చూస్తున్నది. ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో భారత్-బంగ్లాల మధ్య బంధాలకు బీటలు వారుతున్నాయి. దీంతో పాక్ బంగ్లాతో రక్షణ బంధాలను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ఈ రెండు దేశాలమధ్య రక్షణ సంబంధాలు మరింత బలపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగ్లాదేశ్ వైమానిక దళానికి జేఎఫ్-17 థండర్ యుద్ధ విమానాలు సరఫరా చేసే అంశంపై రెండు దేశాల వైమానిక దళాధిపతులు చర్చలు జరిపినట్టు పాకిస్థాన్ సైన్యం వెల్లడించింది.
అయితే ఈ విమానాల కొనుగోలు అంశంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. చైనా చెంగ్డు ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్, పాకిస్థాన్ ఏరోనాటికల్ కాంప్లెక్స్ కలిపి అభివృద్ధి చేసిన జేఎఫ్-17 థండర్ ఒకే ఇంజిన్ తో పనిచేసే తేలికపాటి యుద్ధ విమానం. భారత్ తో జరిగిన ఇటీవలికాల ఉద్రిక్తతల్లో ఈ విమానం సామర్థ్యాన్ని నిరూపించిందని పాకిస్థాన్ చెబుతున్నా, దాని ప్రభావంపై నిపుణుల మధ్య ఇంకా స్పష్టత లేదని రక్షణ విశ్లేషకులు అంటున్నారు. మే 7 నుంచి 10వరకు జరిగిన భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తల్లో పాకిస్థాన్ ప్రధానంగా చైనా తయారీ జే-10 యుద్ధ విమానాలను ఉపయోగించినట్టు సైనిక వర్గాలు వెల్లడించాయి.
ఇస్లామాబాద్ లో జరిగిన రక్షణ బృందం సమావేశం
బంగ్లాదేశ్ వైమానికి దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ హసన్ మహ్మద్ ఖాన్ నేతృత్వంలో ఉన్నతస్థాయి రక్షణ బృందం మంగళవారం ఇస్లామాబాద్ లోని ఎయిర్ హెడ్ క్వార్టర్స్ లో పాకిస్థాన్ వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ జహీర్ అహ్మద్ బాబర్ సిధును కలిసింది.
ఈసమావేశంలో శిక్షణ, సామర్థ్యవృద్ధి, అంతరిక్ష రంగంలో సహకారం వంటి అంశాలపై చర్చలు జరిగాయని పాకిస్థాన్ సైన్యపు మీడియా విభాగం ఐఎన్ పీఆర్ తెలిపింది. జేఎఫ్-17 యుద్ధ విమానాల కొనుగోలు అవకాశాలపై కూడా విస్తృతంగా మాట్లాడినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది బంగ్లాదేశ్ బృందం పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన కీలక కేంద్రాలను కూడా సందర్శించింది. ప్రాథమిక శిక్షణ నుంచి అధునాతన స్థాయి వరకు బంగ్లాదేశ్ వైమానిక దళానికి పూర్తి స్థాయి శిక్షణ అందిస్తామని హామీ ఇచ్చారు. సూపర్ ముష్షక్ శిక్షణ విమానాలను వేగంగా అందజేస్తామని, దీర్ఘకాలిక సాంకేతిక సహకారం కూడా ఉంటుందని తెలిపారు.
తాజా వార్తలు
- మలేషియా బ్యాడ్మింటన్ టోర్నమెంట్: సెమీస్కు పీవీ సింధు
- అబుదాబిలో 7 మోటార్బైక్ ప్రమాదాలు.. 9 మందికి గాయాలు..!!
- సల్మియా మార్కెట్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- బు సిల్లా ఇంటర్ఛేంజ్పై తాత్కాలిక ట్రాఫిక్ ఆంక్షలు..!!
- రికాల్ నెస్లే బేబీ మిల్క్ ఉత్పత్తులపై ఒమన్ హెచ్చరిక..!!
- బహ్రెయిన్ లో నకిలీ ట్రాఫిక్ మెసేజుల హల్చల్..అలెర్ట్ జారీ..!!
- జెడ్డా కార్నిచ్లో 63 సీ బర్డ్స్ రిలీజ్..!!
- ఏపీ లో ప్రభుత్వ పాఠశాలల్లో సిక్ రూమ్ లు ఏర్పాటు
- ఖతార్లో పొగమంచు, అత్యల్ప ఉష్ణోగ్రతలు..!!
- ఫ్రాన్స్, పోలాండ్ చికెన్, గుడ్ల దిగుమతిపై సౌదీ నిషేధం..!!







