బహ్రెయిన్ లో యువత సామర్థ్యాలకు పదును..!!
- January 08, 2026
మనామా: బహ్రెయిన్ లో యువజన కేంద్రాలకు ప్రాధాన్యత కల్పించనున్నారు. యువతలోని ప్రతిభను, వారి సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో యువజన సాధికారత కేంద్రాలు కేంద్రంగా ఉన్నాయని నార్తెర్న్ గవర్నరేట్ గవర్నర్ హసన్ అబ్దుల్లా అల్ మదానీ అన్నారు. అబు సైబా యువజన సాధికారత కేంద్రం డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్ సాదిక్ సల్మాన్ హబీబ్, పలువురు బోర్డు సభ్యులతో ఆయన సమావేశం అయ్యారు.
ఈ సమావేశంలో యువజన కేంద్రాల స్థాపన, స్థానిక యువత అవసరాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. అలాగే పిల్లలు, టీనేజర్లకు అందిస్తున్న సేవలను సమీక్షించారు. సమాజానికి ప్రయోజనం చేకూర్చే విధంగా కేంద్రాలు కార్యక్రమాలను డిజైన్ చేయాలని సూచించారు. యువతలోని ప్రతిభను పోషించడంలో మరియు వారి సామర్థ్యాలను అభివృద్ధి చేయడంలో యువజన సాధికారత కేంద్రాలు పోషిస్తున్న కీలక పాత్రను, చేపడుతున్న విశిష్ట ప్రయత్నాలను ఈ సందర్భంగా గవర్నర్ హసన్ అబ్దుల్లా అల్ మదానీ ప్రశంసించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీతో ఫ్లైదుబాయ్ పైలట్ భావోద్వేగ సంభాషణ
- అదృష్టం కాదు.. ప్రణాళికే గల్ఫ్ దేశాల ఆర్థిక బలానికి కారణం..!!
- ఒమన్‌లో 2.56 లక్షలకు వృద్ధుల సంఖ్య..!!
- సౌదీలో హౌతీ బాలిస్టిక్ మిసైల్ కూల్చివేత..!!
- అక్టోబర్ నెలంతా దేశవ్యాప్త నిరసనలు.. CJP కీలక పిలుపు
- పైలట్ స్మిత్ మచ్చర్ కోలుకుంటున్నారు..భారత రాయబారి..!!
- మదీనాలో హౌతీ దాడి.. తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- షార్జా జ్యువెలరీ షోలో ప్రపంచంలోనే ఎత్తైన బంగారు బార్..
- కువైట్‌లో వర్షాలు.. తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..







