బిఎస్సీ అగ్రికల్చర్ ప్రశ్న పత్రం లీక్
- January 09, 2026
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(PJTSAU) లో మూడవ సంవత్సరం బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సు చదువుతున్న సుమారు 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థుల ప్రవేశాలను రద్దు చేసి, వారిని తిరిగి వ్యవసాయ శాఖ కి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల ఉప కులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, ఇతర అధికారుల తో కలసి జగిత్యాల వ్యవసాయ కళాశాలని సందర్శించారు. వివిధ రకాల రికార్డుల పరిశీలన, సీసీ ఫుటేజ్‌ల ఆధారంగా సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్న పత్రాలు లీకు అవుతున్నట్లు అనుమానించారు. ఈ అంశాన్ని సమగ్రంగా విచారణ చేసేందుకు ముగ్గురు అధికారులతో కమిటీని నియమించారు.
ఈ కమిటీ అన్ని కోణాల నుంచి విచారణ నిర్వహించింది. వ్యవసాయ శాఖ లో ఏ ఈ ఓ లుగా పని చేస్తూ వ్యవసాయ వర్సిటీ లో ఇన్ సర్వీస్ కోటా లో 3వ ఏడాది బీ ఎస్సీ అగ్రికల్చర్ చదువుతున్న సుమారు 35 మంది అభ్యర్థులు ఒక పథకం ప్రకారం సెమిస్టర్ ఫైనల్ పరీక్షల ప్రశ్న పత్రాలను వర్సిటీ సిబ్బంది సహకారంతో లీకు చేసి వాట్సాప్ గ్రూప్ లలో ఇతర వ్యవసాయ కళాశాలల విద్యార్థులకి పంపుతున్నారనీ, ఈ వ్యవహారం లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారిందని తేల్చారు. ఒక పథకం ప్రకారం కొన్నేళ్లు గా ఈ వ్యవహారం జరుగుతోందని నిర్ధారించారు. వర్సిటీ ఈ అంశాన్ని చాలా తీవ్రం గా పరిగణిస్తూ ఒక ఉన్నతాధికారి సహా నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
అదే విధంగా వ్యవసాయ శాఖ నుంచి ఇన్ సర్వీస్ కోటాలో వచ్చిన సుమారు 35 మంది ని డిస్మిస్ చేస్తూ వారిని వ్యవసాయ శాఖ కి తిరిగి పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. 2014 నుంచి 2024 వరకూ పూర్తి స్థాయిలో విశ్వ విద్యాలయం లో ఉన్నత అధికారులు లేకపోవడం తో ఎన్నో అవకతవకలు జరిగాయని, ప్రశ్న పత్రాల లీకేజీ కుంభకోణం అందులో ఒకటనీ ఉప కులపతి అర్దాస్ జానయ్య పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ప్రక్షాళన మొదలు పెట్టి బాధ్యులైన వారిని సస్పెండ్ చేశామని వివరించారు. అవసరం అయితే సైబర్ నేరాల విభాగానికి ఫిర్యాదు చేసి సమగ్ర విచారణ చేయాలని కోరతామన్నారు. ఈ అంశానికి సంబంధం ఉన్నవారిని వదిలి పెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని, భవిష్యత్ లో ఇటువంటివి పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకుంటామని ఉప కులపతి అల్దాస్ జానయ్య స్పష్టం చేశారు.
తాజా వార్తలు
- ఇరాన్ లో పెరుగుతున్న హింసాత్మకం..62 మంది మృతి
- కేటీఆర్ కు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి అంతర్జాతీయ ఆహ్వానం
- సంక్రాంతి సెలవుల పై కీలక అప్డేట్..
- ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
- రేపే PSLV-C62 ప్రయోగానికి కౌంటౌన్
- దోహాలో ప్రవాసీ భారతీయ దివస్ 2026 వేడుకలు—‘నారి శక్తి’కి ప్రత్యేక గౌరవం
- క్యాష్ లెస్ పేమెంట్స్ కు మారిన పూరీ అండ్ కరక్..!!
- ఇరాన్ ఆంక్షలతో బాస్మతి ఎగుమతులకు బ్రేక్
- గల్ఫ్ దేశాలలో 'ధురంధర్' నిషేధంపై ఫిర్యాదు..!!
- కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!







