కువైట్ లో దుమ్ముతో కూడిన గాలులు, చిరు జల్లులు..!!
- January 10, 2026
కువైట్: కువైట్‌లో దుమ్ముతో కూడిన గాలులు మరియు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అయితే వారాంతపు వాతావరణం పగటిపూట తేలికపాటిగా మరియు రాత్రి చల్లగా ఉంటుందని, ఎడారి ప్రాంతాలలో మంచు కురిసే అవకాశం ఉందని కేంద్రం యాక్టింగ్ డైరెక్టర్ ధరర్ అల్-అలీ తెలిపారు.
వాయువ్య దిశ నుండి గంటకు 15-45 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో దుమ్ముతో కూడిన గాలులు వీస్తాయని, ఉత్తర ప్రాంతాలలో తేలికపాటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. గరిష్టంగా 18°C నుండి 20°C వరకు, రాత్రిపూట కనిష్ట ఉష్ణోగ్రతలు 5°C మరియు 7°C మధ్య ఉంటాయని తెలిపారు. ముఖ్యంగా తెల్లవారు జామున పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గుతుందని హెచ్చరించారు.
తాజా వార్తలు
- డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వాడొద్దు..
- మూడు దశాబ్దాలకు పైగా ప్రవాసాంధ్రులకు సేవలు.. ఉద్యోగ విరమణ చేసిన జాన్ సుందర్ శీలా
- అబుదాబిలో దీపావళి వేడుకల్లో పాల్గొన్న షేక్ నహ్యాన్ బిన్ ముబారక్..
- ఖతార్‌లో ఘనంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు..
- హజ్ 2027కు భారత్‌కు 1,75,025 మంది యాత్రికుల కోటా..
- దుబాయ్‌లో మరో కీలక పెడెస్ట్రియన్ బ్రిడ్జి..
- ఇరాన్‌కు ఆయుధాల సరఫరాను అడ్డుకోవడమే అమెరికా వ్యూహం!
- ఖోర్ ఫక్కాన్‌లో ఆయిల్ మరకలు.. అల్ లులూయా బీచ్ తాత్కాలికంగా మూసివేత
- లడఖ్‌లో ప్రపంచలోనే అత్యంత ఎత్తైన రైల్వే స్టేషన్
- రియాద్‌లో ‘వైమానిక ముప్పు’ హెచ్చరిక.. నిమిషాల వ్యవధిలోనే ఉపసంహరణ







