దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!

- January 10, 2026 , by Maagulf
దుబాయ్ లో విల్లా ఫైనాన్సింగ్ స్కామ్..ముగ్గురికి జైలుశిక్ష..!!

దుబాయ్: విల్లా ఫైనాన్సింగ్ స్కామ్ కేసుకు సంబంధించి దుబాయ్ కోర్టు ముగ్గురు అరబ్ వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.  రియల్ ఎస్టేట్ ఫైనాన్సింగ్ స్కామ్ ద్వారా వారు మోసం చేసిన బాధిత ఫ్యామిలీకి Dh900,000 తిరిగి చెల్లించాలని ఆదేశించింది. నిందితులు ఒక ప్రసిద్ధ ఆస్తి డెవలపర్ ప్రతినిధులుగా నటించి, బాధితులను విల్లా ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టమని ఒప్పించి, వారు సృష్టించిన నకిలీ కంపెనీ ద్వారా తనఖా ఫైనాన్సింగ్‌కు హామీ ఇచ్చారని కోర్టు తెలిపింది.   

కోర్టు రికార్డుల ప్రకారం.. బాధిత ఫ్యామిలీ సోషల్ మీడియాలో మార్టిగేజ్ ఫండింగ్ అందించే ప్రకటనను చూసారు. కంపెనీ సేల్స్ మేనేజర్‌గా పరిచయం చేసుకున్న ఒక వ్యక్తి వారిని సంప్రదించాడు. అనేక సమావేశాల తర్వాత, మోసగాళ్ళు వాణిజ్య లైసెన్స్, ఒక ప్రధాన డెవలపర్‌కు ఆపాదించబడిన ప్రాపర్టీ సేల్ డీడ్ మరియు ప్రభుత్వంతో కురుర్చుకున్న ఒప్పందం వంటి ప్రామాణికమైన డాక్యుమెంట్లను వారికి చూపించారు. 

దీంతో వాళ్లు చెప్పిన ఆఫర్ నిజమైనదని నమ్మి, ఆ ఫ్యామిలీ విల్లా కొనుగోలు చేయడానికి అంగీకరించి డిపాజిట్ కింద Dh800,000  చెల్లించారు. డబ్బు అందుకున్న వెంటనే, ఆ ముగ్గురూ కనిపించకుండా పోయారు. మోసపోయిన ఫ్యామిలీ.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు విచారణ చేసి నిందితులను అరెస్టు చేశారు. 

క్రిమినల్ కోర్టు ఆ వ్యక్తులను దోషులుగా నిర్ధారించి, వారికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది.  మోసం చేసిన మొత్తాన్ని ఐదు శాతం వడ్డీతో తిరిగి చెల్లించాలని ఆదేశించింది. వారి శిక్షలు పూర్తయిన తర్వాత వారిని బహిష్కరించాలని ఆదేశించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com