ఖతార్లో భారతీయ ఖైదీలకు తమిళనాడు ప్రభుత్వ సహాయం
- July 28, 2016
భారతదేశంలోని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఓ కేసులో శిక్ష ఎదుర్కొంటున్న ముగ్గురు ఖైదీలకు న్యాయ సహాయం అందించేందుకుగాను ముందుకు రావడం ఖతార్లో ఇదే ప్రధమం. 2012లో దోహాలోని న్యూ సలాటా ఏరియాలో జరిగిన ఖతారీ మహిళ హత్య కేసులో ముగ్గురు వ్యక్తులు దోషులుగా తేలారు. వీరిలో ఇద్దరికి మరణ శిక్ష విధించారు. మరో వ్యక్తికి జీవిత ఖైదు విధించబడింది. ఈ కేసులో అప్పీల్ కోసం నాన్ రెసిడెంట్స్ ఇండియన్ (ఎన్ఆర్ఐ) సెల్ ఆఫ్ తమిళనాడు గవర్నమెంట్, 9,50,000 (51,000 ఖతారీ రియాల్స్) చెక్ని క్లియర్ చేసి ఢిల్లీకి పంపించారు. దోహా లా ఫర్మ్కి ఈ మొత్తాన్ని పంపించి, కోర్టు తీర్పుపై అప్పీల్ చేయనున్నారు. దోషుల్లో ఒకరైన పెరుమాల్ కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు ఆయన భార్య రాజమ్మాల్ చెప్పారు. రాజమ్మాల్ కూడా ఇటీవలే సర్జరీ చేయించుకున్నారు. పెరుమాల్కి రెగ్యులర్ డయాలసిస్ అవసరమని రాజమ్మాల్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







