ఒమన్ జాతీయులకి ఉన్నత ఉద్యోగాలు: ప్రభుత్వ విజ్ఞప్తి
- July 28, 2016
ఒమన్స్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కంపెనీలు ఇకపై ఎక్కువగా ఒమనీ ఎంప్లాయీస్‌కి అవకాశం కల్పించాలనీ, సీనియర్ పొజిషన్లలో వారికే పెద్ద పీట వేయాలని సర్కులర్లో పేర్కొంది. ఈ కంపెనీల్లో చాలా తక్కువగా నేషనలైజేషన ప్రక్రియ జరుగుతోందని స్టేట్ ఆడిట్ కంట్రోల్ రిపోర్ట్‌లో స్పష్తమవడంతో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఈ చర్యల్ని తీసుకుంది. సీనియర్ పొజిషన్లలో ఉన్న వలసదారుల్ని ఒమనీయులతో రీప్లేస్ చేయాలని ఈ సందర్బంగా అల్టిమేటం జారీ చేసింది. కొన్ని కంపెనీలలో 70 శాతం పైగా ఉద్యోగులు వలసదారులేననీ, వారంతా 60 ఏళ్ళ వయసు పైబడినవారేనని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఐదేళ్ళ ప్లాన్ పెట్టుకుని, వలసదారుల్ని ఒమనీయులతో రీప్లేస్ చేసే చర్యలు తీసుకోవాలని మినిస్ట్రీ కోరింది. ఎయిర్ ట్రావెల్ విషయంలో అండర్ సెక్రెటరీలు, అడ్వైజర్లు, డాక్టర్లు, కన్సల్టెంట్లు, ఎక్స్‌పర్ట్‌లు, వాలిస్ తదితరులకు బిజినెస్ క్లాస్ టిక్కెట్లు ఇవ్వాలనీ,మిగిలినవారికి ఎకానమీ క్లాసు ఇవ్వాలని మినిస్ట్రీ సూచించింది. ప్రభుత్వ ఏజెన్సీలకు సంబంధించిన వాహనాలకు ట్రాకింగ్ డివైజ్‌లను ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఆదేశాలు జారీ అయ్యాయి. అంతర్జాతీయంగా చమురు ధరల పతనంతో మినిస్ట్రీ ఇప్పటిదాకా 19 సర్క్యులర్స్ జారీ చేసింది.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్‌పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







