నదిలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ సహాయంతో కాపాడిన వైమానిక దళం
- July 28, 2016
యమునా నది ఉధృతి కారణంగా చిక్కుకుపోయిన ఎనిమిది మంది వ్యక్తులను భారత వైమానిక దళ సిబ్బంది హెలికాప్టర్ సహాయంతో రక్షించారు. యమునా నది తీరంలోని యుమునానగర్ జిల్లాలో మంధేవాలా గ్రామ సమీపంలో ఎనిమిది మంది వరదలో చిక్కుకుపోయినట్లు కంట్రోల్ రూంకు సమాచారం వచ్చిందని హరియాణా రెవెన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మినిస్టర్ కెప్టెన్ అభిమన్యు తెలిపారు. నది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో వారి వద్దకు పడవల్లో వెళ్లడం అసాధ్యమని భావించిన అధికారులు హెలికాప్టర్ పంపించమని కోరారు. సానుకూలంగా స్పందించిన ఐఏఎఫ్ వెంటనే ఎంఐ-17 హెలికాప్టర్‌ను పంపించింది.
హెలికాప్టర్ సాయంతో నదికి ఆవలి ఒడ్డున చిక్కుకుపోయిన ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడారు. వారిలో ఏడుగురు యమునానగర్‌లోని కొల్లివాలా గ్రామస్థులు కాగా, మరొకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. తక్షణమే స్పందించి హెలికాప్టర్ పంపించమని ఐఏఎఫ్‌ను కోరినందుకు రాష్ట్ర సీఎం మనోహర్ లాల్ కట్టర్, చీఫ్ సెక్రటరీ డీఎస్ దేశి, రెవెన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అదనపు చీఫ్ సెక్రటరీ ఆనంద్ అరోరాలకు డిప్యూటీ కమిషనర్ ఎస్‌ఎస్ అహ్లువాలియా ధన్యవాదాలు తెలిపారు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







