కొత్త పౌర విమానయాన పాలసీ వల్ల మారుమూల ప్రాంతాలకు అనుసంధానత పెరుగుతుంది

- July 28, 2016 , by Maagulf
కొత్త పౌర విమానయాన పాలసీ వల్ల మారుమూల ప్రాంతాలకు అనుసంధానత పెరుగుతుంది

కొత్త పౌర విమానయాన పాలసీ వల్ల పెట్టుబడులు పెరిగి మారుమూల ప్రాంతాలకూ అనుసంధానత పెరుగుతుందని.. ఫలితంగా విమాన సర్వీసుల నిర్వాహకులు, ప్రయాణికులు లబ్ధిపొందుతారని కేంద్ర మంత్రి అశోక గజపతిరాజు తెలిపారు. లోక్‌సభలో అనుబంధ ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఈ విషయాన్ని తెలిపారు. విమానాశ్రయాల ఏర్పాటుకు కేంద్రం 80శాతం రాష్ట్రం 20శాతం నిధులను పెట్టుబడుల రూపంలో పెడతాయని.. అదే ఈశాన్య రాష్ట్రాల్లో కేంద్రం వాటా 90శాతం వరకు ఉంటుందని చెప్పారు. ఈ పథకం విజయవంతమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com