‘స్పిరిట్’ మూవీ విడుదల తేదీ ఫిక్స్
- January 17, 2026
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అభిమానులకు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శుభవార్త అందింది. ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2027 మార్చి 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ ప్రకటనతో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.ఈ సినిమాను టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ పతాకాలపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
హీరో ప్రభాస్, చిత్ర నిర్మాణ సంస్థలు, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ రిలీజ్ డేట్‌ను పంచుకున్నారు. ‘స్పిరిట్’ ఒక హైఓల్టేజ్ కాప్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఇందులో ప్రభాస్ ఒక శక్తివంతమైన పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. ‘యానిమల్’ బ్యూటీ తృప్తి డిమ్రి హీరోయిన్గా నటిస్తుండగా,
వివేక్ ఒబెరాయ్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీతో పాటు మొత్తం తొమ్మిది భాషల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి బ్లాక్బస్టర్ల తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ‘స్పిరిట్’పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజా వార్తలు
- యాదగిరిగుట్ట ఈవోగా భవాని శంకర్
- పార్ట్‌టైం జాబ్ చేశారనే అనుమానంతో అమెరికాలో ఇండియన్ స్టూడెంట్స్ అరెస్ట్!
- JEE Main 2026 : అడ్మిట్ కార్డులు విడుదల..
- చిన్నస్వామిలో మ్యాచ్‌లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!







