ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- January 17, 2026
విజయవాడ: సముద్ర తీరప్రాంత పోర్టుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏపీ ప్రభుత్వం కీలక కార్యచరణ చేపట్టింది. రాష్ట్రంలో షిప్ బిల్డింగ్, మరమ్మతుల కేంద్రాల ఏర్పాటుకు అనుసరిం చాల్సిన విధానాలపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ పోర్టుల్లో అమలులో ఉన్న విధానాలను రాష్ట్ర అధికారులు పరిశీలించారు. అక్కడి అత్యు త్తమ విధానాలను ఇక్కడ అమలు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలతో అందుకు అనుగు ణంగా ప్రభుత్వం ఒప్పందాలను కుదుర్చుకో నుండటం విశేషం.
ప్రధానంగా నౌకల మరమ్మతు సదుపాయాలు, విడిభాగాల తయారీ, సరఫరాదా రులు, వాటిని పరీక్షించే సదుపాయాలు ఒకేచోట ఉండే విధంగా క్లస్టర్లను అభివృద్ధి చేస్తారు. నౌకా నిర్మాణంలో వచ్చే ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడం, పోర్టుల ఆటోమేషన్‌పై శిక్షణ, అంతర్జాతీయ ప్రమాణాల మేరకు మరమ్మ తులు తదితర అంశాలకు ఇందులో ప్రాధాన్యతను ఇవ్వనున్నారు. పోర్టుల అభివృద్ధి క్రమంలో రూ.15,601 కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు దిగ్గజ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పం దాన్ని కుదుర్చుకున్నాయి.
ఇందుకుగాను గోవా షిప్ యార్డు లిమిటెడ్ మచిలీపట్నం పోర్టు మారిటైం రంగంలో 15,60155 పెట్టుబడులు ప్రభుత్వంతో ప్రముఖ సంస్థల ఒప్పందం పరిధిలో నౌకా నిర్మాణం, మరమ్మతుల కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.రాష్ట్రానికి ఉన్న 1,054 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆధా రంగా మారిటైం రంగంలో భారీగా పెట్టుబడులు ఆకర్షించాలన్నది ప్రభుత్వం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది.ఈ మేరకు ఈ రంగంలోని వివిధ సంస్థలతో ప్రభుత్వం ఇప్పటికే సంప్రదింపులను జరుపుతోంది. అంతేకాకుండా ఎంఓయూలను సైతం కుదుర్చుకుంటోంది. మచిలీపట్నం పోర్టు పరిధిలో నౌక: గోవా షిప్ యార్డు లిమిటెడ్ దాదాపు రూ.1,500 కోట్ల పెట్టుబడితో మచిలీపట్నం పోర్టు పరిధిలో నౌక నిర్మాణం, మరమ్మతుల సదుపాయాలను కల్పిం చేందుకు ముందుకువచ్చి ప్రతిపాదనలను సమ ర్పించింది. అయితే సంస్థ అభ్యర్ధన మేరకు ఇక్కడ 200 ఎకరాలను కేటాయించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఆ సంస్థకు నామినేషన్ పద్ధతిలో ప్రాజెక్టును కేటాయించాలా? ఆర్ఎఫ్పీ ద్వారా అనుమతించాలా అన్న విషయంపై ప్రభుత్వం ఆలోచిస్తోంది.
యునైటెడ్ పెట్రో గ్రూప్ రూ.7,600 కోట్లతో షిప్ బిల్డింగ్, మరమ్మతుల కేంద్రాన్ని మచిలీపట్నంలో ఏర్పాటు చేసేందుకు గాను ఆర్ఎఫ్పీ దాఖలు చేసింది. ప్రాజెక్టు అమ లుకు మొత్తం 1,185 ఎకరాలను కేటాయించాలని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. మూలపేటలో నావల్ షిప్ బిల్డింగ్: సాగర్ డిఫెన్స్ ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీకాకుళంలోని మూలపేట పోర్టులో రెండు దశల్లో నావల్ షిప్ బిల్డింగ్, మరమ్మతులు కేంద్రం ఏర్పాటుకు ప్రతి పాదించింది. దీనికి గాను రూ.501 కోట్ల పెట్టు బడులను పెట్టనుంది. మొదటి దశ ప్రాజెక్టుకు 50 ఎకరాలను, రెండో దశకు గాను 150 ఎక రాలను కేటాయించేందుకు ప్రభుత్వం అను మతించింది. మత్స్యశాఖ భూ ములను ఏపీమారిటైం బోర్డుకు బదిలీ చేయాలని ఆదేశించింది.
దుగరాజపట్నంలో షిప్ బిల్డింగ్ పరిశ్రమ:
హిందూస్థాన్ షిప్‌యార్డు లిమిటెడ్ దుగరాజ పట్నం/మూలపేటలో షిప్‌బిల్డింగ్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రతిపాదించింది. ఇందుకు రూ.3,000 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నట్లు పేర్కొంది. దీనికోసం ఫీజిబిలిటీ స్టడీని ఇప్పటికే చేపట్టింది. ఇక్కడ ప్రధానంగా జెఎం బాక్సీ రూ.3,000 కోట్లతో నౌకా నిర్మాణం, మారిటైం ఇండస్ట్రియల్ క్లస్టర్ ను అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించింది. దుగరాజపట్నంలో పోర్టు, షిప్‌బిల్డింగ్ క్లస్టర్లో ఒక యాంకర్ షిప్ యార్డు (ఏడాదికి 0.5 మిలియన్ టన్నుల స్థూల రవాణా) ప్రారం భించినప్పటి నుంచి పదేళ్లలో నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలి. రైట్స్ సంస్థ టెక్నో ఎకనమిక్ ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా పోర్టు ఏర్పాటుకు నిర్ణయించింది. ఏపీ మారిటైం బోర్డు, విశాఖ పోర్టు ట్రస్టు సమన్వయంతో ప్రాజెక్టు అమలవుతుంది. ఈ ప్రాజెక్టు దేశ షిప్‌బిల్డింగ్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంలో దోహద పడుతుంది. మారిటైం ఇండియా విజన్ 2030, వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఏర్పాటు కానుండటం గమనార్హం. దుగరాజపట్నంలో రెండు దశల్లో ప్రాజెక్టు ఏర్పాటుకు మొత్తం 500 ఎకరాలను కేటాయించాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. ప్రాజెక్టు ఏర్పాటుకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు సంస్థ ప్రతినిధుల బృందం ఈ నెలలో పరిశీలించేందుకు రానుంది.
తాజా వార్తలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు







