ఐదు రోజుల్లో అదరగొట్టిన మెగాస్టార్ చిరంజీవి

- January 17, 2026 , by Maagulf
ఐదు రోజుల్లో అదరగొట్టిన మెగాస్టార్ చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన మూవీ మన శంకరవర ప్రసాద్ గారు.ఈ నెల 12న విడుదలైన ఈ మూవీకి ఫస్ట్ షో నుంచే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. మెగాస్టార్ ను వింటేజ్ లుక్ లో చూపించిన దర్శకుడు అనిల్ రావిపూడి పూర్తి స్థాయిలో ఈ మూవీని వినోదాత్మకంగా రూపొందించాడు. ఫుల్ లెంగ్త్ కామెడీ మూవీలా ఈ చిత్రాన్ని రూపొందించాడు. వెంకటేష్ కేమియో రోల్, హీరోయిన్ గా నయనతార లుక్ చాలా బావుంది. భార్య, భర్తల మధ్య అనుబంధాన్ని చూపించేలా ఈ మూవీ తెరకెక్కించాడు అనిల్ రావిపూడి. ఈ కామెడీకి జనం ఇరగబడిన మరీ నవ్వుతున్నారు. అటు యాక్షన్ తో పాటు విపరీతమైన వినోదాన్ని అందించాడు. అందుకే సంక్రాంతి బరిలో విడుదలైన అన్ని మూవీస్ కంటే కూడా మెగాస్టార్ మూవీకి ఎక్కువ ప్లస్ పాయింట్స్ వచ్చాయి. కమర్షియల్ గా కూడా రికార్డ్ స్థాయిలో ఆకట్టుకున్నాడు. మన శంకరవర ప్రసాగ్ గారు మూవీ కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 226 కోట్లు వసూళ్లు సాధించాయి. ఓ తెలుగు మూవీగా ఇంత తక్కువ టైమ్ లో అంత మొత్తం గ్రాస్ కలెక్ట్ చేయడం మాత్రం ఓ రికార్డ్ గానే చెప్పాలి. మెగా ఊపు చూస్తుంటే ఈ శనివారం, ఆదివారం కూడా ఈ వసూళ్లు మరో స్థాయిలో ఉండబోతున్నాయి అనేలా ఉంది. తెలుగు నుంచి ఇప్పటి వరకూ హయ్యొస్ట్ గ్రాస్ రికార్డ్ గా వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ పేరు మీదే ఉంది. ఇప్పుడీ రికార్డ్ ను మన శంకరవర ప్రసాగ్ గారు బీట్ చేయడం మాత్రం చాలా సులువే అన్నట్టుగా ఉంది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com