బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- January 17, 2026
మనామా: బహ్రెయిన్ లో చలిగాలుల తీవ్రత ప్రారంభమైంది. శనివారం ఉదయం పలు ప్రాంతాలలో తక్కువ తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కింగ్ ఫాహ్ద్ కాజ్వే వాస్తవ ఉష్ణోగ్రత 11°C నమోదు కాగా, గాలి మరియు వాతావరణ పరిస్థితుల కారణంగా ఉష్ణోగ్రత 6°Cకి పడిపోయింది. బహ్రెయిన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉష్ణోగ్రత 13°C వద్ద ఉండగా, ఉదయం 7°C గా నమోదైంది.
సిత్రాలో వాస్తవ ఉష్ణోగ్రత 12°C కాగా, నివాసితులు 9°Cకి దగ్గరగా ఉన్న చల్లని వాతావరణాన్ని ఎదుర్కొంటున్నారు. దుర్రత్ అల్ బహ్రెయిన్ అత్యంత శీతల ప్రదేశాలలో ఒకటి. ఇక్క 11°C నమోదు కాగా, ఉదయం 5°C గా రికార్డు అయింది.
బహ్రెయిన్ విశ్వవిద్యాలయం మరియు రషీద్ ఈక్వెస్ట్రియన్ & హార్స్ రేసింగ్ క్లబ్లో ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. అక్కడ వాస్తవ ఉష్ణోగ్రతలు 11°C అయితే, ఉదయం చల్లని గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు 7°C మరియు 8°C మధ్య రికార్డు అయ్యాయి.
ఉదయం వేళల్లో చల్లని గాలుల తీవ్రత అధికంగా ఉంటుందని, ముఖ్యంగా ప్రయాణించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!







