పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- January 17, 2026
వెస్ట్ బెంగాల్: రైల్వే ప్రయాణికులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కల నెరవేరింది. దేశంలోనే మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. త్వరలోనే పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ ఈ తొలి వందే భారత్ స్లీపర్ సర్వీసు ఆ రాష్ట్రంలోనే ప్రారంభించారు. బెంగాల్‌లోని హౌరా నుంచి అస్సాంలోని గౌహతి (కామాఖ్య) మధ్య ఈ వందే భారత్ స్లీపర్ రైలు నడవనుంది.
ఈ మార్గంలో ప్రస్తుతం నడుస్తున్న వేగవంతమైన రైలు అయిన సరైఘాట్ ఎక్స్‌ప్రెస్ కంటే ఈ వందే భారత్ స్లీపర్ రైలు సుమారు 3 గంటల తక్కువ సమయంలోనే గమ్యాన్ని చేరుకుంటుంది.హౌరా నుంచి గౌహతి మధ్య ఉన్న 958 కిలోమీటర్ల దూరాన్ని ఈ వందే భారత్ స్లీపర్ కేవలం 14 గంటల్లోనే కవర్ చేస్తుంది. ఈ వందే భారత్ స్లీపర్ గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ప్రస్తుతం 130 కిలోమీటర్ల వేగంతోనే నడపనున్నారు.
సాయంత్రం 6 గంటల 20 నిమిషాలకు హౌరాలో బయలుదేరనున్న ఈ వందే భారత్ స్లీపర్ రైలు మరుసటి రోజు ఉదయం 8 గంటల 20 నిమిషాలకు కామాఖ్య స్టేషన్‌కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో కామాఖ్యలో సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హౌరాకు చేరుకుంటుంది. హౌరా నుంచి గురువారం తప్ప మిగిలిన 6 రోజులు కామాఖ్య నుంచి బుధవారం తప్ప మిగిలిన 6 రోజులు ఈ వందే భారత్ స్లీపర్ రైలు నడుస్తుంది.
తాజా వార్తలు
- ఏపీ గేమ్ ఛేంజర్ గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్..
- అమెరికా: L1 వీసాపై పని లేకుండా ఉంటే ఏమవుతుందో తెలుసా?
- పట్టాలెక్కిన తొలి వందే భారత్ స్లీపర్ రైలు
- అలా చేస్తే వదిలేదే లేదు: సీపీ సజ్జనార్
- మర్డర్ వైరల్ వీడియోపై సౌదీ అరేబియా క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో కోల్డ్ మార్నింగ్..పడిపోయిన ఉష్ణోగ్రతలు..!!
- దుబాయ్‌లోని 2 కమ్యూనిటీలలో పెయిడ్ పార్కింగ్..డైలీ రోటిన్స్ ఎఫెక్ట్..!!
- ఒమన్ లో ఎయిర్ లిఫ్ట్..పలు వాహనాలు సీజ్..!!
- గాజా బోర్డ్ ఆఫ్ పీస్ సభ్యులను ప్రకటించిన వైట్ హౌస్..!!
- కువైట్ లో మల్టిపుల్-ట్రిప్ డిపార్చర్ పర్మిట్ ప్రారంభం..!!







