సినీ నిర్మాత ను అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు
- July 28, 2016
సినీ నిర్మాత కేఎస్ రామారావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఫిల్మ్‌నగర్ కల్చరల్ సెంటర్ పోర్టికో కూలిన ఘటనలో ఆయనను అరెస్టు చేయవద్దంటూ బంజారాహిల్స్ పోలీసులకు గురువారం ఆదేశాలు జారీచేసింది. ఇద్దరు కార్మికుల మరణానికి కారణమంటూ తమపై పోలీసులు నమోదు చేసిన కేసును రద్దుచేయాలని కోరుతూ ఎఫ్‌ఎన్‌సీసీ అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు కేఎస్ రామారావు, రాజశేఖర్‌రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన దాఖలు చేశారు. పిటిషనను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. వారి తరపు న్యాయవాది వాదిస్తూ.. పిటిషనర్లపై భారత శిక్షా స్మృతిలోని 304-ఎ, 337, 338 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారని, ఈ సెక్షన్లు వారికి వర్తించవన్నారు. ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తూ.. జీహెచఎంసీ చట్టంలోని నిబంధనలకు వ్యతిరేకంగా పిటిషనర్లు అక్రమనిర్మాణాన్ని ప్రోత్సహించడం వల్లనే ప్రమా దం జరిగిందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు..పోలీసులు నమోదు చేసిన సెక్షన్లు పిటిషనర్లకు వర్తించవని అభిప్రాయపడింది. సీఆర్‌పీసీ 41 కింద ఇచ్చిన నోటీసులపై విచారణకు హాజరై సహకరించాలని న్యాయస్థానం వారికి స్పష్టం చేసింది. వ్యాజ్యంలో అదనపు సెక్షన్లుచేర్చితే హైకోర్టును ఆశ్రయించవచ్చని సూచించింది. ముగ్గురి అరెస్టు ఈ ఘటనతో సంబంధం మున్న కాంట్రాక్టర్ కొండల్‌రావు, బాల్‌రాజు, ఇంజనీర్ సుధాకర్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. పోర్టికో నిర్మాణానికి ఆమోద ముద్ర వేసిన మిగతా కార్యవర్గంపై కూడా కేసు నమోదు చేసే యోచనలో పోలీసులున్నట్టు తెలిసింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







