భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- January 20, 2026
భారతీయ మూలాలు కలిగిన ప్రముఖ ఫిల్మ్‌మేకర్, నటుడు, నిర్మాత వెంకట్ సాయి గుండా న్యూయార్క్ నగరంలో 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌ను విజయవంతంగా ప్రారంభించారు. ఈ బూటిక్ ఫెస్టివల్ స్వతంత్ర కథకులకు ప్రపంచ వేదికగా నిలిచింది. కరీంనగర్ (తెలంగాణ)కు చెందిన వెంకట్ సాయి గుండా, తన ఫీచర్ ఫిల్మ్ 'ది డిజర్వింగ్'తో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇది 25కి పైగా ఫెస్టివల్స్‌లో స్క్రీనింగ్ అయి, అనేక అవార్డులు సాధించింది. ఇప్పుడు ఫెస్టివల్ డైరెక్టర్‌గా, స్వతంత్ర సినిమాలకు మద్దతు ఇచ్చేలా ఈ వేదికను ఏర్పాటు చేశారు.
జనవరి 10-11, 2026న న్యూయార్క్‌లో జరిగిన తొలి ఎడిషన్‌లో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల నుంచి ఫిల్మ్మేకర్లు, కళాకారులు హాజరయ్యారు. వ్యాపారం కంటే భావోద్వేగాలు, నిజాయితీ, మానవీయ కథలపై దృష్టి సారించిన ఈ ఫెస్టివల్ అద్భుతంగా నిర్వహించబడింది. ఫెస్టివల్‌ను జగ్గీ అరోరా, జేడీ బ్రూక్‌షైర్, మహేశ్వరపాండియన్ సర్వణన్, తరుణ్ డేగల, తిరుమలేష్ గుండ్రాత్, ప్రత్యూష వుడతలతో కూడిన టీమ్ సహకారంతో నిర్వహించింది. క్రియేటర్-ఫస్ట్ ఆలోచనతో, ధైర్యమైన, వ్యక్తిగత కథలకు ప్రాధాన్యత ఇచ్చింది.“సినిమా చేయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఫిల్మ్‌మేకర్లకు మద్దతు ఇవ్వడం, వారి కథలను ప్రపంచానికి చేర్చడమే లక్ష్యం,” అని వెంకట్ సాయి గుండా తెలిపారు.
రాబోయే ఎడిషన్లలో వర్టికల్ స్టోరీటెల్లింగ్‌ను అధికారిక విభాగంగా చేర్చనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. 2026 ఎడిషన్ సబ్మిషన్లు ప్రస్తుతం ఓపెన్‌లో ఉన్నాయి. ఈ ఫెస్టివల్ భారతీయ స్వతంత్ర సినిమా రంగానికి గర్వకారణంగా నిలిచింది. న్యూయార్క్‌లో జరిగిన ఈ విజయవంతమైన తొలి ఎడిషన్, భారతీయ ఫిల్మ్మేకర్లు కేవలం అంతర్జాతీయ సినిమాల్లో పాల్గొనడమే కాకుండా, నాయకత్వం, సహకారం, సృజనాత్మకలో గ్లోబల్ సినిమాలకు పోటీగా నిలిచేందుకు ఉపయోగపడనున్నట్లు తెలిపారు.
విజేతలు
• ఉత్తమ ఫీచర్ ఫిల్మ్: మొహమ్మద్మహది కతిరాచీ–In Other Words
• ఉత్తమ షార్ట్ ఫిల్మ్: Moon Romance, Moon
• ఉత్తమ డాక్యుమెంటరీ: మాథ్యూ ఫ్లాయిడ్–Lessons from 100: Reflections In My Centennial Year
• ఉత్తమ దర్శకత్వం: నాడన్ పైన్స్–Father’s Son
• ఉత్తమ నటుడు: తాహా మొహమ్మది–In Other Words
• ఉత్తమ నటి: అంజా బోథే–Loslassen
• ఉత్తమ స్క్రీన్‌ప్లే: క్రిస్టిన్ మేరీ బుష్–Serenity Peak
• ఉత్తమ కామెడీ: గ్రెగ్ కిర్క్‌పాట్రిక్ జూనియర్–Another Day
• ఉత్తమ ఎడిటింగ్: జావియర్ యానెజ్–Amira
• ఉత్తమ AI ఫిల్మ్: మిచల్ జాన్ ఓవెర్చుక్ – Broken Arrow
• ఉత్తమ హారర్/థ్రిల్లర్: డార్విన్ రేనా –Blood Mist
• ఉత్తమ సామాజిక ప్రభావ కథ అవార్డు: డగ్లస్ రయాన్ – 3 Minutos
• ఉత్తమ డెబ్యూ ఫిల్మ్‌మేకర్: Making Megaforce
• ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ (జ్యూరీ అవార్డు): బ్రియాన్ న్యాప్మిల్లర్ – Sheepdogs
• ఉత్తమ మైక్రో షార్ట్: జూలియా ఉల్బ్రిచ్ హోర్తా – The Other One
• ఉత్తమ ప్రయోగాత్మక చిత్రం: ఎథాన్ నీయోన్ – Blickity Black
• ఉత్తమ సంగీతం: మాలిక్ మాలికీ – In the Bad Times
• ఉత్తమ సైన్స్ ఫిక్షన్ చిత్రం: మ్యాక్సెన్స్ బోస్సే & నోలన్ కార్లే – Ignis Oppidum
• ఉత్తమ యానిమేషన్: క్రిస్టినా కొల్మెనారెస్, మాన్యువల్-ఆంటోనియో మోంటేాగుడో – Memoria Colectiva
• ఉత్తమ దక్షిణ ఆసియా చిత్రం: రిషి రాజ్ ఆచార్య – ద్రౌపది (Draupadi)
• ఉత్తమ ఫోటో / విజువల్ ఆర్ట్: సీఆర్ షెర్మన్ – Drawing in Dreams
• స్టోరీటెల్లర్ అప్రీషియేషన్ అవార్డు: గురుస్వామి రవితేజ – Cockery
• ఎక్సలెన్స్ ఇన్ మ్యూజికల్ స్టోరీటెల్లింగ్: అనిల్ – Priya Priya పాట
తాజా వార్తలు
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతులపై ఒమన్ నిషేధం..!!
- ఫిబ్రవరిలో ఖతార్ హలాల్ ఫెస్టివల్..!!
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు







