భరణి దర్శకత్వం లో వినాయక్...

- July 28, 2016 , by Maagulf
భరణి దర్శకత్వం లో  వినాయక్...

టాలీవుడ్‌ టాప్‌ డైరక్టర్‌లలో ఒకరైన వినాయక్‌ ఇప్పుడు నిర్మాతగా మారబోతున్నారు. మిథునం సినిమాతో తనకంటూ ప్రత్యేకతను చాటిన తనికెళ్ల భరణి దర్శకత్వం వహించబోయే ఓ షార్ట్‌ఫిలింకు ఈ మాస్ డైరెక్టర్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. భరణి దర్శకత్వం వహిస్తున్న ఈ షార్ట్ ఫిలింకు 'లాస్ట్ ఫార్మర్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ షార్ట్‌ఫిలిం నిర్మిస్తున్న వినాయక్... మంచి కథతో కూడిన షార్ట్‌ ఫిల్మ్స్‌ దొరికితే మరిన్ని వాటిని నిర్మించేందుకు రెడీ అంటున్నాడు. మరోవైపు చిరంజీవి 150వ సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నాడు వినాయక్. ఇదిలాఉంటే.. గతంలో తనికెళ్ల భరణి తెరకెక్కించిన 'సిరా' చిత్రం మంచి పేరును పొంది విమర్శకుల ప్రశంసలు పొందింది. అంతేకాకుండా 'మిథునం' చిత్రం కూడా మంచి గుర్తింపు పొందింది. వీరిద్దరి కాంబినేషన్‌లో రూపొందనున్న షార్ట్‌ఫిలిం త్వరలో పట్టాలెక్కనుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com