OTTలోకి రానున్న క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’
- January 20, 2026
చాలా గ్యాప్ తరువాత శోభిత ధూళిపాళ ప్రధానమైన పాత్రను పోషించిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ ‘చీకటిలో’. థియేటర్లలో కాకుండా ఈ సినిమాను OTTలో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఈ నెల 23వ తేదీ నుంచి ఈ సినిమా ‘అమెజాన్ ప్రైమ్’ లో అందుబాటులోకి రానుంది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాను, తెలుగుతో పాటు ఇతర భాషల్లోను వదులుతున్నారు.
ఈ సినిమాలో ‘సంధ్య’ అనే పాత్రలో శోభిత కనిపించనుంది. రియల్ క్రైమ్ స్టోరీస్ ను గురించి చెప్పే ఒక కాన్సెప్ట్ తో ఆమె ‘చీకటిలో’ అనే ఒక పాడ్ కాస్ట్ ను మొదలుపెడుతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో యువతుల హత్యలు వరుసగా జరుగుతూ ఉంటాయి. సైకో కిల్లర్ చీకటిలో తాను అనుకున్న పనిని చాలా పకడ్బందీగా పూర్తి చేస్తూ ఉంటాడు. జరుగుతున్న హత్యలలో తన మార్క్ ఉండేలా చూసుకుంటాడు. అదే పద్ధతిలో ఆ కిల్లర్ సంధ్య దగ్గర పనిచేసే యువతిని హత్య చేస్తాడు.
దాంతో ఆ నేరస్థుడిని తానే పట్టుకోవాలనే నిర్ణయానికి సంధ్య వస్తుంది. అందుకోసం ఆమె ఎలాంటి పథకం వేస్తుంది? సైకో కిల్లర్ ను పట్టుకునే విషయంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? ఆమెకి తెలిసే నిజాలేమిటి? అనేది కథ. విశ్వదేవ్ రాచకొండ చైతన్య వరలక్ష్మి ఈషా చావ్లా ఆమని ఝాన్సీ తదితరులు కీలకమైన పాత్రలను పోషించారు. ఈ క్రైమ్ థ్రిల్లర్ ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి మరి.
తాజా వార్తలు
- వైరల్ వీడియోల పై ఒమన్ పోలీసులు దర్యాప్తు.. చట్టపరమైన చర్యలకు సిద్ధం
- ఎన్నిక ఏదైనా కూటమిదే ఘనవిజయం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్ మెరీనాలో 670 మంది కార్మికులకు భద్రత, సామాజిక అవగాహన కార్యక్రమాలు
- గ్లోబల్ విలేజ్ సీజన్ 31 VIP ప్యాక్‌లు విడుదల.. పరిమిత సంఖ్యలో విక్రయాలు
- గల్ఫ్ ప్రవాసులకు ఆన్లైన్లో ఓపెన్ యూనివర్సిటీ కోర్సులు
- OMCAP ఆధ్వర్యంలో జర్మనీలో ఉద్యోగాలకు 55 మంది ఏపీ నర్సుల ఎంపిక..
- మారిషస్ స్టేట్ హౌస్‌లో డా.గజల్ శ్రీనివాస్ గానం
- తెలంగాణను దేశంలో అగ్రశ్రేణి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దుతాం: మంత్రి జూపల్లి
- ఆంధ్రప్రదేశ్ సంప్రదాయ హస్తకళలకు కొత్త ఊపిరి పోస్తున్న లేపాక్షి
- తెలంగాణ జైళ్ల శాఖకు అరుదైన గౌరవం.. 109వ స్కోచ్ అవార్డు







