సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!

- January 21, 2026 , by Maagulf
సలాలాకు దక్షిణంగా అరేబియా సముద్రంలో భూకంపం..!!

మస్కట్: సుల్తాన్ ఖబూస్ విశ్వవిద్యాలయంలోని భూకంప పర్యవేక్షణ కేంద్రం ప్రకటించిన వివరాల ప్రకారం, బుధవారం తెల్లవారుజామున అరేబియా సముద్రంలో 5.4 తీవ్రతతో ఒక మోస్తరు భూకంపం సంభవించింది.

ఈ ప్రకంపనలు స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారు జామున 4:27 గంటలకు సంభవించాయి. ఈ భూకంప కేంద్రం సలాలాకు సుమారు 245 కిలోమీటర్ల దక్షిణంగా ఉంది. భూకంప కేంద్రం సముద్రంలో ఉండటంతో జనావాస ప్రాంతాలకు నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com