ఎమిరేట్స్ గుర్తింపు పత్రాల వివరాల ఇవ్వని 280 మంది ఉద్యోగుల జూలై జీతాలు నిలుపుదల
- July 29, 2016
ఎమిరేట్స్ లో గుర్తింపు పత్రాల వివరాల ఇవ్వడం లో అలసత్వం కనబర్చిన 280 మంది ఉద్యోగులకు జూలై జీతాలు నిలుపుదల చేశారు. జాతీయ స్థాయిలో అన్ని ఆర్థిక లావాదేవీలు మరియు విధానాలకు సంబంధించి ఒక ముఖ్యమైన సూచనని ఆర్ధిక మంత్రిత్వశాఖ ఇటీవల ప్రకటించింది. ఇందుకు సంబంధించిన సర్క్యులర్ నం 03, 3 వ ఏప్రిల్, 2016 న జారీ చేయబడింది. ఫెడరల్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఉద్యోగి ఎమిరేట్స్ గుర్తింపు పత్రాలకు చెందిన వివరాలని నమోదు చేయించాల్సిన విషయానికి సంబంధించిన వాజ్యం అమలు ప్రారంభమవుతుందని తెలిపింది. మరియు అసంపూర్ణంగా లేదా సరికాని జాతీయ ఐ డి వివరాలను ఇవ్వని ఉద్యోగులు జూలై జీతాలు నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. సంపూర్తిగా లేదా సరికాని జాతీయ గుర్తింపు వివరాలతో 3000 మంది ఉద్యోగులతో పోల్చితే 280 మంది ఉద్యోగులు మాత్రమే ఆ వివరాలు అందించలేదు.ఎమిరేట్ ఐ డి సంఖ్య అన్ని ఫెడరల్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ లావాదేవీలని వేగవంతం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన ప్రక్రియ అని ప్రకటించింది..ఆర్ధిక వనరులని మేనేజ్మెంట్ సహాయ కార్యదర్శి మరియం మహమ్మద్ అల్ అమిరి మాట్లాడుతూ వ్యవస్థలో అవసరమైన సమాచారం నమోదు పూర్తయినదని, ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం అసంపూర్తిగా ఉందని అందుకే అందరికి సరైన డేటా ఉండేందుకు ఈ సమాచారం నమోదు కావాల్సి ఉంటుందన్నారు. దీని ద్వారా అన్ని లావాదేవీలు దేశంలో సులభతరం అవుతాయని అన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







