ఎగబాకిన బంగారం, వెండి ధరలు
- July 29, 2016
బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు తీశాయి. శుక్రవారం ఇక్కడి బులియన్ మార్కెట్లో పది గ్రాముల మేలిమి బంగారం ధర 315 రూపాయలు పెరిగి 31,230 రూపాయలకు చేరుకుంది. కిలో వెండి ధర ఏకంగా 1,410 రూపా యలు ఎగబాకి 48,160 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగిన నేపథ్యంలో దేశీయంగా ఇన్వెస్టర్లు, స్టాకిస్టులు పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇచ్చారు. పారిశ్రామిక డిమాండ్ వృద్ధితో వెండి ధర ఒక్కసారిగా పెరిగింది. 2014 ఫిబ్రవరి 21 తర్వాత వెండి ధర మళ్లీ ఈ స్థాయికి చేరుకోవడం ఇదే మొదటిసారి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,341.40 డాలర్లకు చేరుకుంది. ఈ ఏడాది చివర్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందన్న యుఎస్ ఫెడరల్ రిజర్వు సంకేతాల నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఏర్పడింది. ఆగస్టు డెలివరీకి సంబంధించిన యుఎస్ గోల్డ్ ఫ్యూచర్స్ ఔన్స్ ధర 1.1 శాతం మేర పెరిగింది
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







