దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!

- January 26, 2026 , by Maagulf
దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!

యూఏఈ: దుబాయ్‌లోని భారత కాన్సులేట్ లో భారత 77వ గణతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు.  ఈ కార్యక్రమంలో భారతీయ ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.   ఈ సందర్భంగా దుబాయ్‌లోని భారత కాన్సుల్ జనరల్ సతీష్ కుమార్ శివన్ మాట్లాడుతూ.. అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భారత్ సందర్శనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు కొత్త శిఖరాలకు చేరుకున్నాయని అన్నారు.

రక్షణ , అంతరిక్ష సాంకేతిక సహకారం మరియు మౌలిక సదుపాయాల వంటి పలు కీలక రంగాల్లో ఒప్పందాలు కుదిరాయని పేర్కొన్నారు.  భారత్-యూఏఈ  మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్లను అధిగమించిందని, రెండు దేశాలు 2032 నాటికి న్ని $200 బిలియన్లకు వాణిజ్యాన్ని పెంచేందుకు అంగీకరించాయని శివన్ తెలిపారు.    

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com