భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- January 26, 2026
న్యూ ఢిల్లీ: భారత దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి. “వందేమాతరానికి 150 ఏళ్లు” ప్రధాన ఇతివృత్తంగా ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో రిపబ్లిక్ డేను నిర్వహిస్తున్నారు. వేడుకకు ముఖ్య అతిథులుగా ఐరోపా మండలి అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ పాల్గొంటున్నారు. జాతీయ యుద్ధ స్మారకం వద్ద ప్రధాని మోదీ నివాళులు అర్పించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తొలిసారి గణంత్ర వేడుకలు జరిగాయి. ఏపీ హైకోర్టు సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర మంత్రి లోకేశ్, హైకోర్టు న్యాయమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలోని సికింద్రాబార్ పరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటర్ రెడ్డి, శ్రీధర్ బాబు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్‌లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి
- బహ్రెయిన్ లో కాస్మెటిక్ ప్రాక్టీషనర్లు అరెస్టు..!!







