తన ఇండస్ట్రీ పై దృష్టి సారిస్తున్న ఆ పాపులర్ హీరో!
- January 28, 2026
ఇతర ఇండస్ట్రీలో క్రేజీ ఆఫర్స్ కారణంగా మాలీవుడ్ పై తన లవ్ అండ్ ఎఫెక్షన్ తగ్గించిన పృధ్వీరాజ్ సుకుమారన్ మళ్లీ కేరళ ఆడియన్స్ పలకరించబోతున్నాడు. లాస్ట్ ఇయర్ ఎంపురన్2లో కనిపించినప్పటికీ.. క్రెడిట్ మోహన్ లాల్ ఖాతాలో చేరిపోయింది. ఆ తర్వాత విలయాత్ బుద్ద అనే సినిమా చేశాడు కానీ ఆ మూవీ ఒకటి వచ్చిందన్న విషయం కూడా కేరళ ఆడియన్స్ మర్చిపోయారంటే.. సినిమా ఏ లెవల్లో ఆడిందో అర్థం చేసుకోవచ్చు.
ద గోట్ లైఫ్, గురుర్ అంబలనడయిల్ తర్వాత సోలో హీరోగా వరదరాజ మన్నార్ హిట్ కొట్టిన దాఖలాలు లేవు. సొంత గూటికి కాస్త దూరంగా ప్రస్తుతం క్రేజీ ప్రాజెక్ట్స్ వారణాసి, దైరాతో బిజీగా ఉన్నాడు. సలార్2 కూడా లైన్లో ఉంది. ఈ పొరుగు ఇండస్ట్రీలో భారీ ప్రాజెక్ట్స్ తన ఇమేజ్, మార్కెట్ డబుల్ చేస్తాయి కానీ కేరళ ఆడియన్స్తో టచ్ పోతే.. అసలుకే మోసం వస్తుందనుకున్నాడేమో.. ఈ ఏడాది సొంత గూటిలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేయబోతున్నాడు పృధ్వీ. నిషామ్ బషీర్ దర్శకత్వంలో వస్తున్న ఐ నోబడీలో నటిస్తున్నాడు పృధ్వీ రాజ్ సుకుమారన్. ఈ ఏడాది ఫిబ్రవరి 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే వైశాఖ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ ఖలీఫా ఓనం సందర్భంగా ఆగస్టు 20న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. విపిన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంతోష్ ట్రోపీ కూడా ఈ ఏడాదిలోనే రిలీజ్ కాబోతోంది. అలాగే హిందీలో కరీనా కపూర్- మేఘనా గుల్జార్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్ దైరా కూడా 2026నే ప్రేక్షకుల ముందకు రాబోతోంది. మొత్తానికి సౌత్ పోల్, ఇటు నార్త్ పోల్ ని చుట్టేయడానికి సిద్ధమౌతున్నాడు రణ కుంభ.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







