నాగార్జునతో టబు.. మళ్లీ ఇన్నేళ్లకు జంటగా!
- January 28, 2026
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున తన 100వ సినిమాను ఎంతో ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నారు. తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి 'కింగ్ 100' లేదా 'లాటరీ కింగ్' అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నారు. అయితే, ఈ సినిమాలో నాగ్ సరసన ఎవరూ ఊహించని విధంగా సీనియర్ నటి టబు కనిపించబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
నాగార్జున, టబు మధ్య మంచి స్నేహబంధం ఉందన్న సంగతి తెలిసిందే. 'నిన్నే పెళ్లాడుతా', 'ఆవిడ మా ఆవిడే' వంటి సినిమాలతో ఈ జోడీ వెండితెరపై మ్యాజిక్ చేసింది. దాదాపు 27 ఏళ్ల తర్వాత మళ్ళీ వీరు కలిసి నటించబోతున్నారన్న వార్త వినగానే అక్కినేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, నాగ్ 100వ సినిమా గురించి తెలుసుకున్న టబు.. ఆ ల్యాండ్‌మార్క్ మూవీలో తనకోసం ఒక పాత్ర ఉండాలని కోరారట. దీంతో దర్శకుడు రా కార్తీక్ ఆమె కోసం ఒక పవర్ఫుల్ అండ్ కీ రోల్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో కేవలం టబు మాత్రమే కాదు, నాగచైతన్య.. అఖిల్ కూడా కీలక పాత్రల్లో లేదా గెస్ట్ రోల్స్‌లో కనిపించబోతున్నారని సమాచారం. 'మనం' తర్వాత అక్కినేని ముగ్గురు హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపించే అవకాశం ఉండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2026 మే నెలలో సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్‌లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







