వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!

- January 28, 2026 , by Maagulf
వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!

అమెరికా: ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన విదేశీయులకు నియమించుకోవడానికి హెచ్​-1బీ వీసా పై అమెరికాలో మరో కొత్త నిర్ణయం అమల్లోకి వచ్చింది. కొత్త హెచ్​-1బీ వీసా దరఖాస్తులను నిలిపివేయాలని టెక్సాస్​ గవర్నర్ గ్రెగ్ అబాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. గతేడాది హెచ్​-1బీ వీసా దుర్వినియోగం అవుతోందని, ప్రత్యేక నైపుణ్యం లేని ఉద్యోగాలకు వాడుతున్నారని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ ఆరోపించారు. హెచ్​-1బీ వీసా నియామకాలు తక్కువగా జరగాలని చెప్పారు. గురువారం ఫ్లోరిడా ప్రభుత్వ విశ్వవిద్యాలయాల వ్యవస్థను పర్యవేక్షించే బోర్డ్ ఆఫ్ గవర్నర్స్​ వచ్చే ఏడాది వరకు కొత్త హెచ్​-1బీ నియామకాలు నిలిపివేతపై చర్చించనుంది.

ఇక హెచ్​-1బీ వీసా హోల్డర్లు ఉన్న రాష్ట్రాల్లో కాలిఫోర్నియా తర్వాత టెక్సాస్​ ఉంది. యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌ డేటా ప్రకారం, 2025లో 6,100 మంది యజమానుల వద్ద ఉద్యోగం చేసేందుకు 40వేల మందికి పైగా హెచ్‌-1బీ వీసాలు మంజూరయ్యాయి. టెక్సాస్‌ ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1200 మంది పనిచేస్తున్నారు. ఇక హెచ్​-1బీ వీసా కార్యక్రమం 1990లో ప్రారంభమైంది. దీనిని అమెరికాలో కొరత ఉన్న రంగాల్లో ఉన్నత విద్యావంతులు, నిపుణులైన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి తీసుకువచ్చారు. అయితే, హెచ్‌-1బీ వీసా ఫీజు ఇప్పటివరకు దాదాపు రూ.1 లక్ష నుంచి రూ.6 లక్షల మధ్యే ఉండేది. 2025 సెప్టెంబర్ 19న హెచ్​-1బీ వీసా ఫీజును పెంచుతూ ట్రంప్ ఒక అధికారిక ప్రకటన జారీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com