రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- January 28, 2026
దోహా: ఖతార్ లోని రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ లోని కొంత భాగాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పబ్లిక్ వర్క్స్ అథారిటీ ప్రకటించింది. అల్ వుకైర్ దక్షిణ ప్రాంతంలో రోడ్లు మరియు మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్వహణ పనులను చేపట్టడానికి వీలుగా జనవరి 30 అర్ధరాత్రి 12 గంటల నుండి ఫిబ్రవరి 13చివరి వరకు 15 రోజుల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
ఈ మూసివేత సమయంలో రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ లో తూర్పు దిశగా వెళ్లే డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని కోరారు. వారు స్ట్రీట్ నెం. 1035 మీదుగా వెళ్లి, ఆపై 1326, 1327, మరియు 1329 స్ట్రీట్ లను ఉపయోగించి యూ-టర్న్ తీసుకుని, మ్యాప్‌లో చూపిన విధంగా జెర్యాన్ అల్ సాహ్మ్ వీధికి చేరుకుని తమ గమ్యస్థానాలకు వెళ్లాలని సూచించారు.
తాజా వార్తలు
- బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను ప్రకటించిన NATS
- రౌదత్ అల్ ఘెజ్లానియా స్ట్రీట్ 15 రోజుల పాటు మూసివేత..!!
- అమెరికాకు షాకిచ్చిన సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- యూఏఈలో మొట్టమొదటి బయోమెట్రిక్ పేమెంట్స్ ప్రారంభం..!!
- జ్లీబ్ అల్-షుయూఖ్‌లో 10 భవనాలు కూల్చివేత.. నోటీసులు..!!
- హిట్-అండ్-రన్ ప్రమాదం..చిన్నారి మృతి, డ్రైవర్ అరెస్ట్..!!
- ప్రయాణికుడి డబ్బు దుర్వినియోగం..ఇద్దరికి శిక్ష..!!
- వీసాల పై టెక్సాస్ కీలక నిర్ణయం..అదే బాటలో ఫ్లోరిడా!
- చేతి వాచ్ ఆధారంగా అజిత్ పవార్ మృతదేహం గుర్తింపు
- నేటి నుంచి కొత్త ఆధార్ యాప్ ఫుల్ వెర్షన్ అందుబాటులోకి..ప్రధాన ఫీచర్లు ఇవే..







