దేశ రాజధాని దిల్లీలో 'రియో పరుగు'కు ఏర్పాట్లు చురుగ్గా

- July 29, 2016 , by Maagulf
దేశ రాజధాని దిల్లీలో 'రియో పరుగు'కు ఏర్పాట్లు చురుగ్గా

మరికొన్ని రోజుల్లో రియో ఒలింపిక్స్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో 'రియో పరుగు'కు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. కేంద్ర క్రీడల మంత్రి విజయ్‌ గోయల్‌ దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం జెండా వూపి రియో పరుగు ప్రారంభిస్తారు. రియోకు వెళ్లే క్రీడాకారులకు శుభాకాంక్షలు చెప్పేందుకు, చిన్నారులు, యువత, ప్రజల్లో ఒలింపిక్స్‌ గురించి అవగాహన కల్పించడమే రియో పరుగు ముఖ్య లక్ష్యం అని మంత్రి గోయల్‌ అన్నారు.
రియో పరుగులో దాదాపు 20,000 విద్యార్థులు పాల్గొంటారు. మేజర్‌ ధ్యాన్‌చంద్‌ జాతీయ మైదానం నుంచి పరుగు ప్రారంభమై జవహర్‌లాల్‌ నెహ్రూ మైదానం వద్ద ముగుస్తుంది. అలాగే దేశంలోని క్రీడాప్రాధికార కేంద్రాలున్న (శాయ్‌ సెంటర్స్‌) సోనేపత్‌, కోల్‌కతా, భోపాల్‌, గాంధీనగర్‌, తిరువనంతపురంలో పరుగు కార్యక్రమాలు ఉంటాయి. ఈ సందర్భంగా ప్రధాని మోదీ శాయ్‌ రూపొందించిన 'ఇండియన్‌ ఒలింపిక్‌ జర్నీ' పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com