'ది ఇండియా హౌస్' తో తెలుగులో అడుగుపెడుతున్న శాశ్వత్ సచ్‌దేవ్

- February 03, 2026 , by Maagulf
\'ది ఇండియా హౌస్\' తో తెలుగులో అడుగుపెడుతున్న శాశ్వత్ సచ్‌దేవ్

నిఖిల్ సిద్ధార్థ ప్రతిష్టాత్మక పాన్-ఇండియా చిత్రం 'ది ఇండియా హౌస్' షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని వి మెగా పిక్చర్స్‌తో కలిసి ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2 వంటి దేశవ్యాప్తంగా విజయవంతమైన చిత్రాలని అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమర్పిస్తున్నారు. సాయి మంజ్రేకర్ కథానాయిక. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి రామ్ వంశీ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది.

ధురంధర్, ఉరి: ది సర్జికల్ స్ట్రైక్ , ఆర్టికల్ 370 చిత్రాలతో పాపులరైన బాలీవుడ్ స్టార్ కంపోజర్ శాశ్వత్ సచ్‌దేవ్ 'ది ఇండియా హౌస్‌'తో తెలుగులోకి అడుగుపెడుతున్నారని మేకర్స్ ప్రకటించారు. ఆయన ఇప్పటికే ఐదు ఆకట్టుకునే ట్రాక్‌లను కంపోజ్ చేశారు, పాటల చిత్రీకరణ అద్భుతంగా వచ్చింది.

1905 నాటి రాజకీయ నేపధ్యంలో రూపొందుతున్న 'ది ఇండియా హౌస్' విప్లవం, ప్రేమ, త్యాగం వంటి భావోద్వేగాలో అద్భుతంగా ఉండబోతుంది. ఈ చిత్రంలో అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల పని చేస్తున్నారు. బాహుబలి, RRR ఫేం ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ KK సెంథిల్ కుమార్ డీవోపీగా పని చేస్తున్నారు. విశాల్ అబానీ ప్రొడక్షన్ డిజైనర్. దంగల్, బజరంగీ భాయిజాన్, PK చిత్రాలకు ప్రసిద్ధి చెందిన ముఖేష్ ఛబ్రా కాస్టింగ్ డైరెక్టర్
 
ఈ చిత్రం సినిమాటిక్ ఎక్సలెన్స్ అందించేలా ప్రతి విభాగాన్ని నిర్మాత అభిషేక్ అగర్వాల్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.


తారాగణం: నిఖిల్ సిద్ధార్థ, సాయి మంజ్రేకర్, అనుపమ్ ఖేర్  

సాంకేతిక సిబ్బంది:
సమర్పణ: రామ్ చరణ్
నిర్మాతలు: అభిషేక్ అగర్వాల్, విక్రమ్ రెడ్డి
దర్శకత్వం: రామ్ వంశీ కృష్ణ
బ్యానర్లు: అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, వి మెగా పిక్చర్స్
సహ నిర్మాత: మయాంక్ సింఘానియా
సంగీతం: శాశ్వత్ సచ్‌దేవ్
DOP: KK సెంథిల్ కుమార్
ప్రొడక్షన్ డిజైనర్: విశాల్ అబానీ
కాస్ట్యూమ్ డిజైనర్: రజిని
కాస్టింగ్ డైరెక్టర్: ముఖేష్ చాబ్రా
PRO: వంశీ శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com