కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- February 03, 2026
రియాద్: కాజ్వే యాప్‌ను ఉపయోగించే ప్రయాణికుల కోసం కొత్త ప్యాకేజీలను ప్రారంభించినట్లు కింగ్ ఫహద్ కాజ్వే అథారిటీ ప్రకటించింది. ఇవి ఫిబ్రవరి 18 నుండి అమల్లోకి వస్తాయని, టోల్ ఫీజులపై 40 శాతం వరకు తగ్గింపును అందిస్తాయని తెలిపింది. కొత్త టోల్స్ ప్రకారం.. కార్లు మరియు మోటార్‌సైకిళ్లకు SR35, మినీబస్సులకు SR55, పెద్ద బస్సులకు SR70 మరియు ట్రక్కులకు టన్నుకు SR7 గా వసూలు చేయనున్నారు. ఇక తరచూ ప్రయాణించే వారి కోసం ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటించారు.
మొదటి ప్యాకేజీ ధర SR850 గా నిర్ణయించారు. ఇది తీసుకున్న వారు నెలకు లేదా 40 సార్లు ఉపయోగించవచ్చు. ఇక ఫ్రీక్వెంట్ ట్రావెలర్ ప్యాకేజీ ప్యాకేజీ ధర SR1,120 గా ఉంది. ఇది టోల్ ఫీజులపై 20 శాతం వరకు తగ్గింపును అందిస్తుంది. ఇది ఒక సంవత్సరం పాటు లేదా 40 సార్లు రాకపోకల వరకు చెల్లుబాటు అవుతుంది. రౌండ్-ట్రిప్ ప్యాకేజీ ప్యాకేజీ ధర SR60 గా ఉంది. ఇది మొదటిసారి ప్రయాణించిన తేదీ నుండి ఒక వారం పాటు లేదా మొదటి రెండు ప్రయాణాల వరకు చెల్లుబాటు అవుతుందని అథారిటీ ప్రకటించింది.
తాజా వార్తలు
- ఓల్డ్ దోహా పోర్టులో 6రోజులపాటు స్పోర్ట్స్ ఫెస్టివల్..!!
- అబుదాబిలో ఒమన్-యూఏఈ హయ్యర్ కమిటీ సమావేశం..!!
- బహ్రెయిన్ లో కొత్త డిజిటల్ సర్వీస్ ప్రారంభం..!!
- కింగ్ ఫహద్ కాజ్వే క్రాసింగ్ ఫీ పెంపు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్.. ఉరుములతో కూడిన వర్షాలు..!!
- బోయింగ్ డ్రీమ్‌లైనర్ విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ ఇండియా..!!
- భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్
- JEE మెయిన్ సెషన్ 2 పరీక్షల షెడ్యూల్ రిలీజ్
- భారత్‌తో మ్యాచ్ బాయ్‌కాట్ పై షాహిద్ అఫ్రిది కామెంట్స్
- భారత దేశవ్యాప్తంగా 7 కొత్త బుల్లెట్ ట్రైన్లు







