చెత్త బయట వేసే సంస్థలుకు జరిమానా..

- July 29, 2016 , by Maagulf
చెత్త బయట వేసే సంస్థలుకు జరిమానా..

నాలాలు, కాలువల్లో వ్యర్థాలు వేసే హోటళ్లు, ఆస్పత్రులు, ఫంక్షన్‌ హాళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని జీహెచ్‌ ఎంసీ నిర్ణయించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహ రించే వారికి జరిమానా విధించేందుకు ప్రత్యేక అధి కారులను నియమించాలని భావిస్తున్నారు. జరిమానా లను సక్రమంగా వసూలు చేసేందుకు పోలీస్‌ శాఖ తరహాలో ఈ- చలాన్‌ విధానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తు న్నారు. చెత్త డబ్బాలు ఇచ్చినా.. ట్రాలీలు ఏర్పాటు చేసినా పరిస్థితిలో ఆశించిన మార్పు రాక పోవడాన్ని కమిషనర్‌ డాక్టర్‌ బీ.జనార్దన్‌రెడ్డి తీవ్రంగా పరిగణి స్తున్నారు. ఈ క్రమంలో శుక్ర వారం సహాయ వైద్యారోగ్య అధికా రుల (ఏఎంఓహెచ్‌)తో సమావేశం ఏర్పాటుచేసిన ఆయన గ్రేటర్‌లో పారిశుధ్య నిర్వహణ - పరిసరాల పరిశుభ్రతపై చర్చించారు. వ్యాపా ర, వాణిజ్య సంస్థల వ్యర్థాల తరలింపునకు సంబం ధించి విధివిధానాలు మార్చాలని నిర్ణయించా రు. ఆస్పత్రులు, హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్ల నిర్వాహకులు వ్యర్థాలను ట్రాన్స్‌ఫర్‌ స్టేషన్లకు తరలించేలా వాహనాలు సమకూర్చుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయంలో ఉదాసీనత పనికిరాదని, ఆయా సంస్థలే సొంత వాహనాల్లో వ్యర్థాలను తరలించేలా చూడాల న్నారు. ఆహార పదార్థాల వ్యర్థాలు వృథా కాకుండా.. సేంద్రీయ ఎరువుల తయారీ గుంతలు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రస్తుతం నాలాలు, బహి రంగ ప్రదేశాల్లో వాటిని డంప్‌ చేస్తున్నారు. దీంతో పరిసరాలపై తీవ్ర ప్రభావం పడడంతో పాటు.. నగర మూ అపరిశుభ్రంగా కనిపిస్తోంది. దీనికి చెక్‌ పెట్టేం దుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక నిఘా పెట్టి.. ఇక వ్యర్థాల ను బయట వేసే సంస్థలు, నిర్వాహకులకు నిబంధనల ప్రకారం జరిమానా విధించాలని సూచించారు. దీని కోసం ప్రత్యేక అధికారులను నియమించడంతో పాటు జరిమానాల చెల్లింపునకు ఈ చలాన్‌ విధానం అందు బాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. ఇప్పటికే 1830ట్రాలీలను లబ్ధిదారులకు అందజేసిన నేపథ్యంలో అవసరమున్న ప్రాంతాల్లో అదనపు ట్రాలీల కోసం ప్రతిపాదనలు పంపాలని పేర్కొ న్నారు. ప్రస్తుతం చెత్త సేకరిస్తోన్న ట్రాలీల రిజిస్ర్టేషన్‌ వెంటనే పూర్తి చేయాలని ఆదేశిం చారు. సమావేశంలో అదనపు కమిషనర్‌ రవికిరణ్‌ పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com