కొబ్బరితో పాయసం
- July 29, 2016
కావలసిన పదార్ధాలు : బియ్యం : పావుకిలో , పాలు : పావుకిలో , కొబ్బరి పాలు : పావుకిలో , బెల్లం : అరకిలో , నెయ్యి : 1 టేబుల్ స్పూన్ , జీడిపప్పులు, బాదంపప్పులు, కిస్మిస్లు, కుంకుమపువ్వు : కొద్దిగా
తయారుచేయు విధానం :
స్టవ్ వెలిగించి, గిన్నెపెట్టి కొద్దిగా నీళ్ళు పోసి కాగిన తరువాత కడిగిన బియ్యం వేసి ఒక పొంగు వచ్చాక పాలు కలిపి ఉడకనివ్వాలి. పాలు దగ్గర పడ్డాక, సిద్దం చేసిన కొబ్బరి పాలు పోసి అరగంట ఉడకనివ్వాలి. గరిటతో కలుపుతూ వుండాలి. ఇప్పుడు బెల్లంకోరు వేసి కలపాలి పాయసం ఉడికి చిక్కపడుతుంది. ఇప్పుడు నేతిలో వేపిన జీడిపప్పులు, బాదంపప్పులు, కిస్మిస్లు వేసి కలపాలి. కొంచెం పాలల్లో కుంకుమపువ్వు వేసి కలిపి, పాయసంలో వేసి కలిపి యాలుకలపొడి కూడా వేసి మూతపెట్టి స్టవ్ ఆపాలి. అంతే కొబ్బరి పాయసం రెడి.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







