క్యామెల్ పాస్‌ పోర్ట్‌ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!

- February 05, 2026 , by Maagulf
క్యామెల్ పాస్‌ పోర్ట్‌ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!

రియాద్: సౌదీ అరేబియా క్యామెల్ పాస్‌పోర్ట్ ను ప్రారంభించింది. ఇది క్యామెల్ మార్కెట్ విశ్వసనీయతను పెంచడం లక్ష్యంగా పర్యావరణం, నీరు మరియు వ్యవసాయ డిప్యూటీ మంత్రి మన్సూర్ అల్-ముషైతీ తెలిపారు. జాతీయ పశుసంవర్ధక మరియు మత్స్య రంగ అభివృద్ధి కార్యక్రమం కింద మంత్రిత్వ శాఖ ప్రయత్నాలలో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

క్యామెల్ పాస్‌పోర్ట్ లో మైక్రోచిప్ నంబర్, పాస్‌పోర్ట్ నంబర్, ఒంటె పేరు, పుట్టిన తేదీ, జాతి, లింగం, రంగు, పుట్టిన ప్రదేశం, తేదీ మరియు జారీ చేసిన ప్రదేశం, అలాగే రెండు వైపుల నుండి తీసిన ఫోటోలు ఖచ్చితమైన గుర్తింపు ధృవీకరణను అందజేస్తుందని అన్నారు.   ఈ అధికారిక డాక్యుమెంట్ యజమానుల హక్కులను రక్షించడం మరియు వాణిజ్య కార్యకలాపాలను నియంత్రిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com