ముహారక్‌లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!

- February 05, 2026 , by Maagulf
ముహారక్‌లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!

మనామా: ముహారక్ గవర్నరేట్‌లోని ఖలీఫా అల్-కబీర్ స్ట్రీట్ మరియు అబ్దుల్‌రహ్మాన్ అల్-ఫదేల్ స్ట్రీట్ ఇంటర్ సెక్షన్ వద్ద అభివృద్ధి ప్రాజెక్ట్ పూర్తయినట్లు వర్క్స్ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.  ఈ ప్రాజెక్ట్‌లో అబ్దుల్‌రహ్మాన్ అల్-ఫదేల్ స్ట్రీట్ మరియు రోడ్ 1655కి దారితీసే రెండు దిశలలో ఖలీఫా అల్-కబీర్ స్ట్రీట్‌లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్‌ను ప్రారంభించారు. దీంతోపాటు రెండు వేర్వేరు లేన్‌లను నిర్మించనున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించడం మరియు రహదారి భద్రతను పెంచడం ఈ డెవలప్ మెంట్ పనుల లక్ష్యమని తెలిపింది.

భవిష్యత్తులో యుటిలిటీ ఉపయోగం కోసం భూగర్భ మార్గాలను నిర్మించడం, స్ట్రీట్ లైట్లను అప్‌గ్రేడ్ చేయడం, రోడ్డు సిగ్నల్స్ మరియు గైడ్ లైన్స్ బోర్డులను ఏర్పాటు చేయడం మరియు ఖలీఫా అల్-కబీర్ స్ట్రీట్ వెంట రెండు దిశలలో కొత్త ట్రాఫిక్ సిగ్నల్‌లను ఏర్పాటు చేయడం కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ వెల్లడించారు.     

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com