అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- February 05, 2026
దోహా: ఖతార్ జరిగిన GCC భద్రతా సంస్థల "అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4" సైనిక విన్యాసాలు ముగిసాయి. ఒమన్ అంతర్గత మంత్రి సయ్యద్ హమౌద్ బిన్ ఫైసల్ అల్ బుసైది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనతోపాటు ఈ కార్యక్రమానికి GCC అంతర్గత మంత్రులు హాజరయ్యారు.
ఒమన్ తరపున రాయల్ ఒమన్ పోలీస్, సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ మరియు మెడికల్ సిటీ ఫర్ మిలిటరీ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ నుండి సిబ్బంది పాల్గొని తమ సైనిక పాటవాలను ప్రదర్శించారు. గల్ఫ్ భద్రతా సంస్థలతోపాటు అమెరికా నుండి ప్రత్యేక భద్రతా విభాగాలు పాల్గొన్నాయి.
వివిధ రకాల భద్రతా సవాళ్లను ఎదుర్కోవడంలో గల్ఫ్ భద్రతా సంస్థలు ప్రదర్శించిన నైపుణ్యం మరియు అధునాతన సామర్థ్యాలు అందరిని ఆకట్టుకున్నాయి. 11 రోజుల పాటు కొనసాగిన ఈ వ్యాయామంలో 70 కంటే ఎక్కువ శిక్షణా ప్రోగ్రామ్స్ ను అమలు చేశారు. 260 గంటలకు పైగా ఇంటెన్సివ్ ఫీల్డ్ శిక్షణను పూర్తి చేశారు.
తాజా వార్తలు
- రోడ్డు ప్రమాద బాధితులకు ‘గోల్డెన్ అవర్’ చికిత్స: మంత్రి నితిన్
- 25,000 ఉద్యోగాల భర్తీకి కాగ్నిజెంట్ నిర్ణయం
- ఖతార్ లో అంతర్జాతీయ ఖర్జూర ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- అరేబియన్ గల్ఫ్ సెక్యూరిటీ 4..ఆకట్టుకున్న సైనిక విన్యాసాలు..!!
- ముహారక్లో కొత్త లెఫ్ట్-టర్న్ లేన్లు ఓపెన్..!!
- సహల్ యాప్ ద్వారా పాస్పోర్ట్ అప్డేట్..!!
- నా కూతురే అదృష్టాన్ని తెచ్చింది: dh20 మిలియన్ విజేత..!!
- క్యామెల్ పాస్ పోర్ట్ ను ప్రారంభించిన సౌదీ అరేబియా..!!
- ఫైనల్ కి చేరుకున్న భారత్
- భారీ డిస్కౌంట్లు ప్రకటించిన ఎయిర్ ఇండియా







