నటి వాహిని కన్నుమూత
- February 05, 2026
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒకప్పుడు సినిమాలు, సీరియల్స్‌లో కీలక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి జయవాహిని కన్నుమూశారు.గత కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె, బుధవారం తన స్వస్థలమైన విజయనగరంలో తుదిశ్వాస విడిచారు. నటి కరాటే కళ్యాణి సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేశారు. పద్మక్కను కాపాడుకోవాలని ప్రయత్నం చేసినా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
“వాహిని అక్కా(పద్మక్క).. నిన్ను కాపాడాలి అని చాలా ప్రయత్నం చేశాను. కొద్దిసేపటి క్రితం తన జన్మస్థలం అయిన విజయనగరంలో స్వామిని చేరుకుంది. మొన్న చెప్పేశారు ఇక కష్టం అని, ఊరికి తీసుకువెళ్ళిపోయారు అంట.. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. సద్గతి ఓం శాంతి. మేము నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం పద్మక్క. కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను” అని కరాటే కళ్యాణి తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు. వాహిని మరణ వార్త తెలియడంతో, పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు.1978లో విజయనగరంలో జన్మించిన వాసవి, జయ వాహిని పేరుతో టెలివిజన్ మరియు సినీ రంగాల్లో మంచి గుర్తింపు సంపాదించారు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించిన ఆమె అనేక తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.
ముఖ్యంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో ఆమె నటన ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చిపెట్టింది. 2019లో విడుదలైన ‘రఘుపతి వెంకయ్య నాయుడు’ చిత్రంలో వీకే నరేష్ సరసన నటించిన ఆమె, చివరిసారిగా ‘బహిర్భూమి’ సినిమాలో కనిపించారు.గత కొన్ని సంవత్సరాలుగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న వాసవి ఆరోగ్య కారణాల వల్ల నటనకు దూరమయ్యారు. ఆమె పరిస్థితి విషమించడంతో వైద్యులు ఇంటికి తీసుకెళ్లాలని సూచించగా, కుటుంబ సభ్యులు విజయనగరానికి తరలించారు. అక్కడే ఆమె చివరి శ్వాస విడిచారు.
తాజా వార్తలు
- స్కూల్ అడ్మిషన్స్..కొత్త కట్ ఆఫ్ తేదీ పై పేరెంట్స్ ఆందోళన..!!
- సౌదీలో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- దోహా చేరుకున్న జర్మనీ ఛాన్సలర్..!!
- ట్రాఫిక్ అలెర్ట్.. కీలక గల్ఫ్ స్ట్రీట్ మూసివేత..!!
- నెస్లే మరో బ్యాచ్ బేబీ ఫార్ములా రికాల్..!!
- వకాన్ విలేజ్ కు పోటెత్తిన విజిటర్స్..!!
- దుబాయ్ స్కూళ్లలో ఏఐ (AI) పాఠాలు
- నైజీరియాలో 200 మందిని పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదులు
- కేదార్నాథ్: యాత్రికుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు.. సురక్షిత ప్రయాణం
- ఉగాది, కళారత్న పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానం







