నగర జీవనం

- February 05, 2026 , by Maagulf
నగర జీవనం

అంతటా వ్యర్ధం కొని తెచ్చుకొనే  అనర్ధం 
అన్నింటిని చేయసాగే నిత్యం కలుషితం 
అసలైన ఐశ్వర్యం తెలుసుకోక చేసే నిర్వీర్యం
అంతటా పుట్టగొడుగుల్లా అవే ఇంద్రభవనం 
 
అశోకవృక్షాలని తలదన్నేలా నిర్మించి
ఆశల సౌధంలో వీచే గాలులని బంధించి 
ఆహ్లాదవనం క్రమేణా అయ్యే ఎడారితీరం
ఆదమరచిన పవళింపులేక కాలుష్యమయం 

 

మంత్రాలు కాదు యంత్ర శభ్ధాలే మేల్కొలుపులు 
మనసుల్లో వేసుకొనే కొలతలు పలకని పెదవులు 
ముఖాముఖిలో మంచులా కరిగిపోయే పలకరింపులు 
మదిలో అయిష్టతలు పైన వెల్లువలా కపట ప్రేమలు.

అవసరం వేళ మార్చే ఊసరవెల్లిలా రంగులు
అనవసరం అనిపిస్తే మూసేసే ముఖద్వారాలు 
అందరిని ఆకర్షించే అరచేత చరవాణి  మోజులు 
అలజడులు రహదారిపైనే మనసుల్లో స్వార్థాలు

అభివృద్ధి దిశలో వాడని మేధస్సుని
అడ్డులేదని స్వైరవిహారం చేసిన నగరమయ్యే మాయం.

పేరు:  యామిని కోళ్ళూరు 
హామీ పత్రం:  ఇది నా రచన దేనికి అనుకరణ కాదు.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com