న్యూదిల్లీ నుంచి చెన్నై వెళ్లే విమానాలకు అంతరాయం
- July 30, 2016
దిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా న్యూదిల్లీ నుంచి చెన్నై వెళ్లే విమానాలకు అంతరాయం ఏర్పడినట్లు విమానాశ్రయాధికారులు తెలిపారు. దిల్లీ నుంచి వెళ్లాల్సిన వివిధ సంస్థలకు చెందిన 8 విమానాలు వర్షం కారణంగా వాతావరణం అనుకూలించక ఆలస్యంగా బయల్దేరినట్లు వారు తెలిపారు. దిల్లీ చేరుకోవాల్సిన పలు విమానాలకు కూడా అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నిన్నంతా అక్కడి రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్‌కి కూడా తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈరోజు కూడా భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఘనంగా GTWCA 19వ బతుకమ్మ సంబరాలు..
- దుబాయ్‌లో మిడిల్ ఈస్ట్ లోని అతిపెద్ద జ్యువెలరీ డెస్టినేషన్ ప్రారంభం
- దుబాయ్ మెట్రో నుంచి ఎతిహాద్ రైల్ స్టేషన్‌కు నడక మార్గం.. కొత్త పాదచారుల బ్రిడ్జి ప్రారంభం
- సౌదీ రక్షణ మంత్రితో షేక్ మన్సూర్ బిన్ జాయెద్ భేటీ
- ఇరాన్ అణు సామర్థ్యం పై ట్రంప్ వ్యాఖ్యలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!







