NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..

- February 08, 2026 , by Maagulf
NEET UG 2026 నోటిఫికేషన్ విడుదల..

హైదరాబాద్: నీట్-యూజీ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పరీక్షకు సంబంధించి రిజిస్ట్రేషన్లు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్ష ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సులు, బీవీఎస్‌సి, ఏహెచ్, బీహెచ్‌ఎంఎస్‌తోపాటు బీఎస్సీ నర్సింగ్ (ఎమ్మెన్నెస్) వంటి కోర్సుల్లో సీట్లను భర్తీ చేస్తారు. నేటి నుంచి నీట్ రిజిస్ట్రేషన్లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తమ సైట్ http://neet.nta.nic.in లో ప్రారంభించింది. నెల రోజులపాటు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే వచ్చే మార్చి 8, రాత్రి 9 గంటలవరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. అలాగే ఫీజు చెల్లించేందుకు అదే రోజు రాత్రి 11.50 గంటల వరకు అవకాశం ఉంది. అప్లికేషన్లలో పొరపాట్లు సరిదిద్దుకునేందుకు మార్చి 10-12 వరకు అవకాశం ఉంది. మే 3న, ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఐదు గంటల వరకు పరీక్ష నిర్వహిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com