భారత భాషల కోసం ప్రత్యేక AI విప్లవం
- February 09, 2026
న్యూ ఢిల్లీ: 2023లో వివేక్ రాఘవన్, ప్రత్యూష్ కుమార్‌లు స్థాపించిన సర్వం ఏఐ (Sarvam AI) భారతీయ భాషలపై దృష్టి సారించిన తొలి ప్రముఖ ఏఐ స్టార్టప్‌లలో ఒకటిగా గుర్తింపు పొందుతోంది. ఈ సంస్థ హైఎండ్ క్లౌడ్ కంప్యూటింగ్‌కే కాకుండా, సాధారణ స్మార్ట్ఫోన్లలో కూడా పనిచేసేలా టెక్నాలజీని అభివృద్ధి చేయడం విశేషం.
భారతదేశంలోని అనేక ప్రభుత్వ, న్యాయ, బ్యాంకింగ్, విద్యా రంగ డాక్యుమెంట్లు క్లిష్టమైన స్థానిక భాషల్లో ఉంటాయి. వాటిని సులభంగా చదవడం కోసం రూపొందించిన Sarvam Vision టూల్, భారతీయ స్క్రిప్ట్‌లను ఖచ్చితంగా గుర్తించి డిజిటల్ టెక్స్ట్‌గా మార్చగలదు. ఇది ప్రభుత్వ కార్యాలయాలు, ఫైనాన్స్ సంస్థలు, డిజిటల్ ఇండియా ప్రాజెక్టులకు ఎంతో ఉపయోగకరంగా మారుతోంది.
ఇక Bulbul అనే టెక్స్ట్-టు-స్పీచ్ టూల్ ప్రస్తుతం 11 భారతీయ భాషల్లో 32 వాయిస్‌లను అందిస్తోంది. సహజంగా వినిపించే వాయిస్‌లతో కంటెంట్‌ను ఆడియోగా మార్చడం వల్ల ఈ టూల్ విద్యా, మీడియా, కస్టమర్ సపోర్ట్, కంటెంట్ క్రియేషన్ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.
తక్కువ ఖర్చుతో, స్థానిక భాషలకు పూర్తి మద్దతుతో, మెరుగైన OCR సామర్థ్యంతో సర్వం ఏఐ టూల్స్ భారతీయ సంస్థలకు ఆకర్షణీయంగా మారాయి. భారత్‌లో ఏఐ టెక్నాలజీని స్థానిక స్థాయికి తీసుకెళ్లే దిశగా సర్వం ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!
- భారీ సిగరెట్ల స్మగ్లింగ్.. నువైసీబ్ కస్టమ్స్ సీజ్..!!
- 'Tajawob' సక్సెస్.. 156,000 దాటిన రిక్వెస్టులు..!!
- బహ్రెయిన్ లో విద్యుత్-నీటి బిల్లు చెల్లింపు రిజిస్ట్రేషన్లలో పెరుగుదల..!!
- రేపు TTPF 6వ వార్షికోత్సవం
- ఆసియా లాక్రోస్ గేమ్స్‌లో భారత్‌కు డబుల్ టైటిల్
- ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా అమరావతి
- జపాన్‌లో చరిత్ర సృష్టించిన సనాయే తకైచి









