మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- February 09, 2026
మచిలీపట్నం: మచిలీపట్నంలో షిప్ బిల్డింగ్ మరియు షిప్ రిపేర్ సౌకర్యాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయడం హర్షణీయమని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా మచిలీపట్నం పోర్ట్‌కు మరిన్ని అవకాశాలు లభించి, ప్రాంతీయ అభివృద్ధికి కొత్త దిశలు తెరుచుకుంటాయని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డుకు అవసరమైన అధికారాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల పోర్ట్ అభివృద్ధి వేగవంతం కానుందని ఎంపీ బాలశౌరి అన్నారు. ఈ చర్యలతో మచిలీపట్నం పోర్ట్ రూపురేఖలు మారి, జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
షిప్ బిల్డింగ్ మరియు షిప్ రిపేర్ సౌకర్యాల ఏర్పాటుకు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నామని, దీని ద్వారా ప్రాంతంలో ఉపాధి అవకాశాలు పెరిగి, ఆర్థికాభివృద్ధి సాధ్యమవుతుందని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు. బందరు ప్రజల దీర్ఘకాలిక కల నెరవేరే దిశగా ఈ నిర్ణయాలు కీలకంగా నిలుస్తాయని ఆయన అన్నారు.
ఈ అంశానికి సంబంధించిన జివోను జారీ చేసి అనుమతులు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఎంపీ బాలశౌరి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!
- దుబాయ్ గ్లోబల్ విలేజ్ రమదాన్ టైమింగ్స్, స్పెషల్స్..!!









