‘ఆయా షేర్’ ఇంట్రో సాంగ్ షూటింగ్ ప్రారంభం
- February 10, 2026
నేచురల్ స్టార్ నాని ప్రతిష్టాత్మక చిత్రం 'ది ప్యారడైజ్' ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా, షూటింగ్ ఫ్లోర్ నుంచి తాజా అప్‌డేట్‌తో భారీ హైప్‌ను సృష్టిస్తోంది.
వందలాది మంది డ్యాన్సర్స్ కూడిన భారీ సెట్‌లో నాని బ్లాస్టింగ్ ఇంట్రో సాంగ్ ఆయా షేర్ షూటింగ్ ని టీం ప్రారంభించింది. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ గ్రిట్, హై-అడ్రినలిన్ వైబ్‌లతో నిండిన ఎలక్ట్రిఫైయింగ్ మాస్ బ్యాంగర్ అందించారు. రా ఎనర్జీతో నాని డ్యాన్స్ స్టైల్‌కు ఇది పర్ఫెక్ట్ సాంగ్.
విజయ్ 'జన నాయగన్' కు పని చేసిన కొరియోగ్రాఫర్ సుధన్ మాస్టర్, షార్ప్ మూవ్స్, పవర్‌ఫుల్ ఫార్మేషన్స్‌తో ఈ పాటను గూస్‌బంప్స్ కలిగించే విజువల్ స్పెక్టకిల్‌గా మలుస్తున్నారు. నాని ట్రేడ్‌మార్క్ మాడ్‌నెస్, ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్ తో ఈ పాట అద్భుతంగా వుంటుంది.
దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నిర్మాణంలోని ప్రతి అంశంలోనూ ప్రతిష్టాత్మకంగా ది ప్యారడైజ్‌ను రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మోహన్ బాబు, బాలీవుడ్ నటుడు రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.
సిహెచ్ సాయి సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు, నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తారు అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్. ఈ చిత్రం ఎనిమిది భాషలలో పాన్-వరల్డ్ విడుదలకు సిద్ధంగా ఉంది.
తారాగణం: నాని, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, సంపూర్ణేష్ బాబు
సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఓదెల
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
బ్యానర్: SLV సినిమాస్
డిఓపి: సిహెచ్ సాయి
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఎడిటింగ్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
పీఆర్వో: వంశీ-శేఖర్
మార్కెటింగ్: ఫస్ట్ షో
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









