ట్రాఫికింగ్‌ విక్టిమ్స్‌కి అడ్డకట్ట

- July 30, 2016 , by Maagulf
ట్రాఫికింగ్‌ విక్టిమ్స్‌కి అడ్డకట్ట

హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ (మనుషుల అక్రమ రవాణా)కి అడ్డుకట్ట వేసేందుకు ఓ కొత్త కార్యక్రమం దుబాయ్‌లో ప్రారంభమైంది. దుబాయ్‌ పోలీస్‌ మరియు దుబాయ్‌ ఫౌండేషన్‌ ఫర్‌ విమెన్‌ అండ్‌ చిల్డ్రన్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. 'యువర్‌ ప్రొటెక్షన్‌ అవర్‌ హ్యాపీనెస్‌' పేరుతో బాధితుల్ని ఆదుకోవడం ఈ కార్యక్రమం తాలూకు లక్ష్యం. వరల్డ్‌ డే టు కంబాట్‌ ట్రాఫికింగ్‌ ఇన్‌ హ్యూమన్‌బీయింగ్స్‌ సందర్భంగా జులై 30న ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రానున్న ఐదేళ్ళలో ఆరు ప్రోగ్రామ్స్‌ని అమల్లోకి తీసుకొచ్చి, బాధితుల్ని అడ్డుకోవడం, కారకుల్ని శిక్షించడం చేస్తారు. సంబంధిత శాఖలతో ఈ ప్రోగ్రామ్స్‌ని ప్రారంభిస్తారు. డైరెక్టర్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌ డిపార్ట్‌మెంట్‌ కల్నల్‌ మొహమ్మద్‌ అబ్దుల్లా అల్‌ ముర్ర్‌ మాట్లాడుతూ, హ్యూమన్‌ ట్రాఫికింగ్‌కి అడ్డుకట్ట వేసేందుకు యూఏఈ తగిన చర్యలు తీసుకుంటోందనీ, ఇంకా అవసరమైన చర్యల కోసం అన్వేషిస్తోందని తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com