ఇండియన్ ఎంబసీకి 2,419 ఫిర్యాదులు
- July 30, 2016
నెలవారీ ఓపెన్ హౌస్ సందర్భంగా ఇండియన్ ఎంబసీ, 2,419 ఫిర్యాదుల్ని స్వీకరించినట్లు వెల్లడించింది. అంబాసిడర్ సంజీవ్ అరోరా, డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ ఆర్కె సింగ్, ఇతర అధికారులు, ఫిర్యాదుదారులతో సమావేశమయ్యారు. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. కతార్ గవర్నమెంట్తో మాట్లాడి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని అధికారులు తెలిపారు. ఇండియన్ కమ్యూనిటీ బెనెవోలెంట్ ఫోరమ్ (ఐసిబిఎఫ్) అధ్యక్షుడు అరవింద్ పాటిల్ ఈ ఓపెన్ హౌస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంబసీ ప్రతినిథుల బృందం సెంట్రల్ ప్రిజన్ని, మరియు డిపోర్టేషన్ సెంటర్ని ఈ వారం సందర్శించింది. అక్కడి పరిస్థితుల్ని తెలుసుకుంది. 2015లో లేబర్ అండ్ కమ్యూనిటీ వెల్ఫేర్ సెక్షన్ 4,132 ఫిర్యాదుల్ని తీసుకోగా, ఈ ఏడాది ఇప్పటిదాకా 2,419 ఫిర్యాదులను అందుకుంది. ఎంబసీలో నమోదైన మరణాల సంఖ్య 161. 2015లో ఈ సంఖ్య 279గా ఉంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







