బహ్రెయిన్‌లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్‌..!!

- February 11, 2026 , by Maagulf
బహ్రెయిన్‌లో ఇండియన్ బడ్జెట్ 2026పై సెమినార్‌..!!

మనామా: బహ్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం భారత బడ్జెట్ 2026 పై సెమినార్ నిర్వహించింది. యూనియన్ బడ్జెట్ ప్రత్యేకతలు, కల్పించిన రాయితీలు, అవకాశాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వక్తలు, కార్మిక మరియు సామాజిక వ్యవహారాల మాజీ మంత్రి అబ్దుల్ నబీ అల్ షోలా; స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బహ్రెయిన్ కంట్రీ హెడ్  మధు రామన్‌కుట్టి; ICICI సీనియర్ ఫండ్ మేనేజర్ ఇహాబ్ దల్వాయి , బహ్రెయిన్- ఇండియా సొసైటీ చైర్మన్ అబ్దుల్‌రహ్మాన్ జుమా పాల్గొన్నారు.

భారత రాయబారి వినోద్ కె. జాకబ్ మాట్లాడుతూ.. భారత బడ్జెట్ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని, 7.4 శాతం వృద్ధి అంచనాతో USD 4.13 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రూపొందుతుందని ఆయన పేర్కొన్నారు. ఇక GDPలో 4.3 శాతం ఆర్థిక లోటు మరియు 55.6 శాతం రుణ-GDP నిష్పత్తి ఉందని రాయబారి హైలైట్ చేశారు.

భారతదేశాన్ని విశ్వసనీయ ప్రపంచ పెట్టుబడి గమ్యస్థానంగా నిలిపేందుకు, ఆర్థిక సంస్కరణలు, వ్యాపార సౌలభ్యత, దీర్ఘకాలిక వృద్ధి, ప్రజల-కేంద్రీకృత అభివృద్ధిపై భారత ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి వాణిజ్య పరిణామాలను ప్రస్తావిస్తూ, చారిత్రాత్మక భారత్ -ఈయూ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ప్రపంచ ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలను మరింతగా బలోపేతం చేయడంలో భారత్ యొక్క నిబద్ధతను తెలియజేస్తుందని వివరించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com