భారత్‌లో నోకియా సంచలనం..100జీ ఇంటర్నెట్ వస్తోంది
- February 11, 2026
భారత్‌లో ఇంటర్నెట్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ఇప్పటి దాకా 2జీ, 4జీ, 5జీ ప్రపంచాన్ని చూసిన యూజర్లు త్వరలో ఏకంగా 100 జీ చూడబోతున్నారు. దీనికి వేదికగా భారత్ మారబోతోంది. ప్రముఖ దిగ్గజం ఈ టెక్నాలజీపై గట్టిగా కృషి చేస్తోంది. సాధారణంగా ఇంటర్నెట్ అనేది మన జీవితాలో విడదీయలేని భాగం అయిపోయింది. టెక్నాలజీ అమిత వేగంతో దూసుకుపోతోంది. ఒకప్పుడు నెమ్మదిగా లోడ్ అయ్యే వెబ్‌పేజీలు, వీడియోలు బఫర్ అవుతూ ఆగిపోవడం సాధారణంగా ఉండేది. కానీ స్మార్ట్ఫోన్లు విస్తృతంగా అందుబాటులోకి రావడం, 4G ఇంటర్నెట్ ప్రవేశంతో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం వేగవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన డేటా సేవలు అందించడానికి టెలికాం కంపెనీల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఈ పోటీ కారణంగా ఇంటర్నెట్ టెక్నాలజీలో భారీ స్థాయిలో పరిశోధన, అభివృద్ధి జరుగుతోంది.
ఈ క్రమంలోనే ప్రపంచ ప్రసిద్ధ టెలికాం సంస్థ నోకియా(Nokia) భారత్‌లో ఒక కీలక ముందడుగు వేసింది. తమిళనాడు రాజధాని చెన్నైలో నోకియా తన అతిపెద్ద నెట్వర్క్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం ఏమిటంటే భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచే టెక్నాలజీలను అభివృద్ధి చేయడం. ఇక్కడ జరుగుతున్న ముఖ్యమైన పరిశోధనల్లో ఒకటి ఏంటంటే.. 100G ఇంటర్నెట్ టెక్నాలజీ. అయితే, ఈ 100G ఇంటర్నెట్ అంటే ఏమిటి అని చాలామందికి అనుమానం రావొచ్చు. క్లుప్తంగా చెప్పాలంటేడ 100G అంటే సెకనుకు 100 గిగాబిట్ల డేటా బదిలీ వేగం (100 Gbps). ప్రస్తుతం మనం చాలా వేగంగా భావించే 100 Mbps లేదా 1 Gbps కనెక్షన్లతో పోలిస్తే ఇది వందల రెట్లు అధిక సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ డేటా ప్రసరణను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. 100G ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇందులో డేటా విద్యుత్ సంకేతాలుగా కాకుండా.. కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ఈ ప్రక్రియలో కోహెరెంట్ ఆప్టిక్స్ అనే ఆధునిక సాంకేతికత ఉపయోగించబడుతుంది. దీని ద్వారా ఒకే ఫైబర్ కేబుల్ ద్వారా భారీ మొత్తంలో డేటాను ఒకేసారి పంపడం సాధ్యమవుతుంది. చెన్నైలోని నోకియా పరిశోధనా కేంద్రం ఈ టెక్నాలజీని మరింత సమర్థవంతంగా మార్చే పనిలో ఉంది. 100G వంటి సూపర్ ఫాస్ట్ వేగాలను సాధించడానికి DWDM (Dense Wavelength Division Multiplexing) కీలక పాత్ర పోషిస్తుంది.
తాజా వార్తలు
- జేవాకింగ్ ప్రమాదాలపై అవగాహన కల్పించిన దుబాయ్ పోలీసులు
- దుబాయ్ ఎమిరేట్స్ రోడ్ ప్రమాదం: బాధితుల మృతదేహాలు భారత్, శ్రీలంకకు తరలింపు
- వర్షాలు, ప్రకృతి విపత్తుల పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
- హైదరాబాద్ వాతావరణ కేంద్రం అలర్ట్..
- సింగపూర్ చేరుకున్న సీఎం చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెలుగు ప్రజలు
- ఫ్రాన్స్ అధ్యక్షుడి తో ప్రధాని మోడీ సమావేశం
- డయాబెటిస్ నియంత్రణకు ఆధునిక వైద్య విధానాల పై అవగాహన అవసరం: డా.జి.దీప
- అబుదాబిలో ఘనంగా 12వ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
- Dh103,880 విలువైన వాచీల బ్యాగ్‌ను తిరిగిచ్చిన పోలీసులు..!!
- కువైట్ లో విదేశీ పెట్టుబడిదారులకు 15 ఏళ్ల రెసిడెన్సీ..!!









