భారతీయ క్రీడాకారులకు మోదీ ఆల్ ద బెస్ట్ ....
- July 30, 2016
రియో ఒలింపిక్స్‌లో పాల్గొనబోతున్న భారతీయ క్రీడాకారులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ జాతీయ మైదానంలో ఆదివారం ఉదయం ఆయన 'రన్ ఫర్ రియో'ను జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. 2020 ఒలింపిక్స్ క్రీడల నాటికి ప్రతి జిల్లా నుంచి ఒక అథెట్ భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేలా చూస్తామన్నారు. ఈసారి 119 మంది క్రీడాకారులు ఒలింపిక్స్‌కు వెళుతున్నారని, వచ్చే ఏడాది కనీసం 200 మందిని పంపించాలనే సంకల్పాన్ని ప్రభుత్వం తీసుకున్నదని ఆయన తెలిపారు. ఇంకా మోదీ చేసిన టాప్ కామెంట్స్ ఇవి..మన అథ్లెట్లు ప్రపంచ ప్రజల హృదయాన్ని గెలిచి రావాలి. భారత్ అంటే ఏమిటో ప్రపంచానికి చూపాలి. ఆ విశ్వాసం నాకుంది.ప్రతి క్రీడాకారుడు ఒలింపిక్స్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చాలి. ఆటలు అనేవి గెలుపోటముల కోసం కాదు ఉన్నవి. ఆటలు ఉన్నవి మానసిక వికాసం కోసం. ప్రతి వ్యక్తి జీవితంలోనూ క్రీడలు భాగం కావాలి. ప్రతి ఒక్కరి జీవితం వికసించాలి.
ప్రతిసారి ఒలింపిక్స్ క్రీడలకు రెండు రోజులు ముందే భారత క్రీడాకారులను పంపేవారు. ఈసారి 15రోజులు ముందు మన క్రీడాబృందాన్ని పంపిస్తున్నాం. దీనివల్ల తగినంత ప్రాక్టీస్ చేసుకోవడానికి వీలుంటుంది.రియోలో మన క్రీడాకారుల భోజన సౌకర్యం కోసం ఈసారి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాం
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







