హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!

- February 18, 2026 , by Maagulf
హెల్త్ సెంటర్ల వర్కింగ్ అవర్స్ ప్రకటించిన PHCC..!!

దోహా: ఖతార్ లోని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ (PHCC) పవిత్ర రమదాన్ మాసం సందర్భంగా తన 31 ఆరోగ్య కేంద్రాల వర్కింగ్ అవర్స్ ను ప్రకటించింది. ఈ కేంద్రాలు ఆదివారం నుండి గురువారం వరకు నిరంతరం తెరిచి ఉంటాయని తెలిపింది.  ఇందులో 27 ఆరోగ్య కేంద్రాలు ఉదయం 9 గంటల నుండి అర్ధరాత్రి వరకు నిరంతరం పనిచేస్తాయని PHCC సూచించింది. ఈ కేంద్రాలలో డెంటల్ సేవలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు మరియు సాయంత్రం 7 గంటల నుండి అర్ధరాత్రి వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.   

అలాగే, ఆయా సెంటర్లలో వీకెండ్ సేవలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అందిస్తాయని ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సంస్థ పేర్కొంది.  అత్యవసర వైద్య సేవలకు సంబంధించి ఫౌండేషన్ 24/7 అత్యవసర కేసు సేవను అందించడానికి 14 ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కమ్యూనిటీ కాల్ సెంటర్ 16000 ద్వారా 24 గంటలపాటు మెడికల్ అసిస్టెంట్ ను పొందవచ్చని సూచించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com